Aadhaar, PAN on WhatsApp: వాట్సాప్‌లో ఆధార్, పాన్, ఇతర పత్రాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

డిజిలాకర్ ద్వారా వాట్సాప్ నుంచి కూడా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల శాఖ MyGov.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల ఇప్పుడు వాట్సాప్‌ ద్వారానే ఆధార్, పాన్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. అవసరం ఉన్న వారు తమ ఆధార్, పాన్ కార్డు వంటి వాటిని మైగవ్ హెల్ప్ డెస్క్ వాట్సాప్ చాట్ బోట్ (MyGov Helpdesk WhatsApp chatbot) ద్వారా పొందవచ్చు. మొదట ఈ పత్రాలను డిజిలాకర్ లో మాత్రమే యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు డిజిలాకర్ వినియోగదారులు తమ ఖాతాలను వాట్సాప్‌లోనూ ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి.

Aadhaar, PAN on WhatsApp: వాట్సాప్‌లో ఆధార్, పాన్, ఇతర పత్రాలు ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

Aadhaar, PAN on WhatsApp

Aadhaar, PAN on WhatsApp: కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ కొన్నేళ్ల క్రితం దేశంలో డిజిలాకర్‌ను ప్రవేశపెట్టగా దీన్ని ఇప్పటికే కోట్లాది మంది వినియోగించుకుంటున్నారు. విద్యార్థులు డిజిలాకర్‌లో పేర్లు నమోదు చేసుకుని వారి ధ్రువీకరణ పత్రాలను పొందుపర్చుకోవచ్చు. విద్యార్థులే కాకుండా ప్రజలు అందరూ డిజిటల్ వర్షన్ లో డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్లు, బీమా పాలసీ తదతర పత్రాలను అందులో పొందుపర్చుకుని, తమకు అవసరం ఉన్న సమయంలో వాడుకోవచ్చు.

దీని ద్వారా విద్యార్థులు తమ పత్రాలను చేతుల్లో పట్టుకుని తిరిగే అవసరం ఉండదు. డిజిలాకర్ ద్వారా వాట్సాప్ నుంచి కూడా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ సేవల శాఖ MyGov.in ద్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ సౌకర్యం వల్ల ఇప్పుడు వాట్సాప్‌ ద్వారానే ఆధార్, పాన్ కార్డులను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు.

అవసరం ఉన్న వారు తమ ఆధార్, పాన్ కార్డు వంటి వాటిని మైగవ్ హెల్ప్ డెస్క్ వాట్సాప్ చాట్ బోట్ (MyGov Helpdesk WhatsApp chatbot) ద్వారా పొందవచ్చు. మొదట ఈ పత్రాలను డిజిలాకర్ లో మాత్రమే యాక్సెస్ చేయడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు డిజిలాకర్ వినియోగదారులు తమ ఖాతాలను వాట్సాప్‌లోనూ ఎలా ఉపయోగించుకోవచ్చో చూడండి.

1.+91-90131151515 నంబరును మీ ఫోన్ కాంటాక్ట్‌లో సేవ్ చేసుకోండి. ఆ కాంటాక్టుకు MyGov HelpDesk పేరు పెట్టుకోండి.
2. వాట్సాప్ లో కాంటక్ట్ లిస్ట్‌ను రిఫ్రెష్ చేయాలి.
3. మీ వాట్సాప్ లో MyGov HelpDeskను సెర్చ్ చేయండి.
4. ఆ వాట్సాప్ ఖాతాలో నమస్తే, హాయ్ అని టైప్ చేస్తే MyGov HelpDesk చాట్‌బాట్‌ యాక్టివ్ అవుతుంది.
5. చాట్‌బాట్‌ లో అందుబాటులో ఉన్న సేవలను సూచిస్తూ మీకు వాట్సాప్ లో ఓ మెసేజ్ వస్తుంది.
6. మీకు డిజిలాకర్ ఖాతా ఉందా? అని అడుగుతుంది. మీకు డిజిలాకర్ ఉంటే Yes అని లేకపోతే NO అనే ఆప్షన్ పై నొక్కండి.
6. డిజిలాకర్ లేకుంటే మీరు దాన్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
7. డిజిలాకర్ ఉంటే చాట్‌బాట్ లో అడిగిన 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మెనులోని Send అనే ఆప్షన్ ను నొక్కండి.
8. మీ డిజిలాకర్ ఖాతాను లింక్ చేయడానికి, అది మీదేనని ధ్రువీకరించడానికి మీ నంబరుకు OTP వస్తుంది.
9. ఓటీపీని ఎంటర్ చేశాక మీ డిజిలాకర్ లో ఉన్ అన్ని డాక్యుమెంట్ల జాబితా కనపడుతుంది.
10. వాటిలో మీకు కావాల్సిన ఆధార్ లేదా పాన్ కార్డ్, ఇతర ఏదైనా ఒక పత్రానికి సంబంధించిన ఆప్షన్ పై క్లిక్ చేయండి.
11. అనంతరం మీ ఆధార్ లేదా పాన్ కార్డు/ఇతర పత్రం పీడీఎఫ్ వర్షన్ లో డౌన్ లోడ్ అవుతుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..