‘బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందనడాకి సాక్ష్యాల్లేవ్’

‘బర్డ్ ఫ్లూ మనుషులకు సోకుతుందనడాకి సాక్ష్యాల్లేవ్’

Bird Flu: కేంద్ర ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేసింది. మండీలు, ఫౌల్ట్రీ ఉత్పత్తులు నిలిపివేయొద్దని బర్డ్ ఫ్లూ అనేది కోళ్ల నుంచి మనుషులకు సంక్రమిస్తుందనడానికి ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని స్పష్టం చేసింది. బర్డ్ ఫ్లూ ఇప్పటికీ 10రాష్ట్రాల్లోకి ప్రబలినట్లు కేంద్రం కన్ఫామ్ చేసింది.

ఈ మేరకు పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్.. మనుషులకు సోకుతుందనడానికి ఎటువంటి సైంటిఫిక్ రిపోర్టులు లేవని చెప్పారు. ఈ మేరకు ఢిల్లీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలన్నింటికీ మండీలు(హోల్‌సేల్ మార్కెట్లు), ఫౌల్ట్రీ ప్రొడక్ట్స్ లపై నిషేదం విధించకూడదని చెప్పింది.

ముందస్తు జాగ్రత్త చర్యగా.. ఢిల్లీ గవర్నమెంట్ ప్యాకెడ్ చికెన్, నిల్వ ఉంచిన చికెన్ అమ్మకాలపై నిషేదం విధించింది. ఆ తర్వతే గిరిరాజ్ అధికారిక ప్రకటన చేసి 10రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కేసులు ఉన్నాయని అది మనుషులకు సోకే అవకాశాలు లేవని చెప్పారు. బర్డ్ ఫ్లూ ఉన్న ప్రాంతాల్లో నీటి నిల్వలు, మార్కెట్లు, జూ, పౌల్ట్రీ ఫామ్స్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాలని అధికారులను ఆదేశించారు.

2021 జనవరి 11 వరకూ దేశంలో 10రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ కన్ఫామ్ అయింది. అని పశు సంవర్ధక శాఖ స్టేట్ మెంట్ ఇచ్చింది. అంతకంటే ముందు కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లలో పాజిటివ్ వచ్చినట్లు ఆదివారం కన్ఫామ్ అయింది. సోమవారం ఢిల్లీ, ఉత్తరాఖాండ్, మహారాష్ట్రల్లో కన్ఫామ్ అయింది.