ఈటల అన్నా.. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. మల్లారెడ్డి కామెంట్స్!

అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు.

ఈటల అన్నా.. మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావ్.. మల్లారెడ్డి కామెంట్స్!

BRS MLA MallaReddy Comments on BJP MP Candidate Etala Rajender

Updated On : April 26, 2024 / 6:01 PM IST

MallaReddy Comments :  బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి వార్తల్లో నిలిచారు. సొంత పార్టీని ఇబ్బంది పెట్టేలా మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌, మాజీ మంత్రి మల్లారెడ్డి ఓ శుభకార్యంలో ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మల్కాజిగిరిలో ఈటలదే విజయం అంటూ జోస్యం చెప్పారు.

Read Also : MLC Balmoor Venkat : హరీష్‌రావు రాజీనామా లేఖ వృథా కానివ్వను : ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్

అన్నా.. నువ్వే గెలుస్తున్నావ్ అంటూ ఈటల రాజేందర్‌‌ను ఆయన కౌగిలించుకున్నారు. అడిగి మరీ ఈటలతో మల్లారెడ్డి ఫోటోలు, వీడియోలు తీయించుకున్నారు. దాంతో తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.

మేడ్చల్ పార్లమెంట్ పరిధిలో ఓ వివాహ వేడుకకు ఈటల రాజేందర్, మల్లారెడ్డి హాజరయ్యారు. ఆ ఫంక్షన్ హాలులో ఈటల దగ్గరకు వెళ్లిన మల్లారెడ్డి.. అన్నా అంటూ పలకరించారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఆలింగనం చేసుకున్నారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి బీజేపీ అభ్యర్థిని గెలుస్తావ్ అంటూ ఆయన వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. ఈటలను మల్లారెడ్డి ఆలింగనం చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇటీవల మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారనే ప్రచారం జోరుగా జరిగిన సంగతి తెలిసిందే. వరుసగా రెండుసార్లు బీఆర్ఎస్ నుంచి గెలిచిన మల్లారెడ్డి.. ఆ పార్టీ ఓటమి అనంతరం హస్తం గూటికి చేరుతారనే ప్రచారం జరిగింది. తాను పార్టీ మారుతున్నాననే ప్రచారంలో వాస్తవం లేదని మల్లారెడ్డి కొట్టిపారేశారు. ఇప్పుడు, ఈటలతో ఆయన చేసిన కామెంట్స్ మళ్లీ సంచలనంగా మారాయి.

Read Also : 10Tv Conclave : ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగింది- సీఎం జగన్ గాయంపై డా.సింహాద్రి చంద్రశేఖర్