Make India No.1: ‘మేక్ ఇండియా నం.1’ పేరిట జాతీయ మిషన్ ప్రారంభించిన కేజ్రీవాల్.. భారత్‌ను మళ్ళీ గొప్పదేశంగా చేద్దామని పిలుపు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ మిషన్ మేక్ ఇండియా నంబర్ 1ను ప్రారంభించారు. భారత్‌ను మళ్ళీ గొప్పదేశంగా తీర్చిదిద్దడానికి దేశ పౌరులు ముందుకు రావాలని ఆయన అన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడానికి పాఠశాలలు, ఆసుపత్రులను సమర్థంగా నడిపించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహిళలకు సమాన హక్కులు ఉండాలని ఆయన చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించిన ఈ జాతీయ మిషన్ లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలూ చేరాలని ఆయన అన్నారు.

Make India No.1: ‘మేక్ ఇండియా నం.1’ పేరిట జాతీయ మిషన్ ప్రారంభించిన కేజ్రీవాల్.. భారత్‌ను మళ్ళీ గొప్పదేశంగా చేద్దామని పిలుపు

Make India No. 1

Make India No.1: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇవాళ మిషన్ ‘మేక్ ఇండియా నంబర్ 1’ను ప్రారంభించారు. భారత్‌ను మళ్ళీ గొప్పదేశంగా తీర్చిదిద్దడానికి దేశ పౌరులు ముందుకు రావాలని ఆయన అన్నారు. దేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దడానికి పాఠశాలలు, ఆసుపత్రులను సమర్థంగా నడిపించాలని, యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని, మహిళలకు సమాన హక్కులు ఉండాలని ఆయన చెప్పారు.

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రారంభించిన ఈ జాతీయ మిషన్ లో బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు అన్ని పార్టీలూ చేరాలని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరు ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు అయిందని, దేశం చాలా సాధించిందని అన్నారు. అయితే, మన కన్నా ఆలస్యంగా స్వాతంత్ర్యం సాధించిన దేశాలు భారత్ ను అధిగమించి అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు.

భారత్ ఎందుకు వెనకబడిపోయిందని ప్రతి పౌరుడు అడుగుతున్నాడని ఆయన అన్నారు. ప్రపంచంలో నంబర్ 1 దేశంగా భారత్ ను మరోసారి తీర్చిదిద్దాల్సి ఉందని కేజ్రీవాల్ చెప్పారు. దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు అందరూ తాము ఇవాళ ప్రారంభిస్తోన్ మేక్ ఇండియా నంబర్ 1లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు.

Lok Sabha Polls 2024: బిహార్‌లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ