ఢిల్లీలో మాత్రమే టాటా నెక్సాన్, టిగార్ ఈవీ కార్లకు రూ.3లక్షల డిస్కౌంట్

ఢిల్లీలో మాత్రమే టాటా నెక్సాన్, టిగార్ ఈవీ కార్లకు రూ.3లక్షల డిస్కౌంట్

Delhi Govt: ఎలక్ట్రానిక్ సర్వీసుల పరంగా ప్రస్తుతం మంచి సర్వీసు అందిస్తున్న వెహికల్స్ లో టాటా మోటార్స్ ఒకటి. టిగార్ ఈవీ, నెక్సాన్ ఈవీ లాంటి కార్లు దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ గానూ పాపులర్ అయ్యాయి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్పప్పటికీ అతి తక్కువ మంది మాత్రమే కొనుగోలు చేయగలుగుతున్న కార్ ఖరీదు.. ఇండియా రాజధాని ఢిల్లీలో మరింత తగ్గనుంది.

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేసిన ప్రచారంలో భాగంగా.. ఈ కొత్త ఇన్సెంటివ్ స్కీం అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వాడకమే ఎక్కువగా ఉండాలని ప్రమోట్ చేసే దిశగా చేస్తున్నదే ఈ ప్రయత్నం. Nexon EV నుంచి మొదలుపెడితే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

XM, XZ+, XZ+ Lux trim వేరియంట్లలో దొరుకుతుంది. ఈ వేరియంట్ల ధరలు వరుసగా రూ.13.99లక్షలు, రూ.14.99లక్షలు, రూ.15.99లక్షలుగా ఉన్నాయి. లేటెస్ట్ గా ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చిన రూ.3లక్షల డిస్కౌంట్ తో ఇతర SUVలతో పోలిస్తే అత్యంత చౌకగా లభిస్తున్నట్లే.

ఎలక్ట్రిక్ SUVలను పాపులరైజ్ చేయడంలో ఢిల్లీ గవర్నమెంట్ ముందుంది. ఈ క్రమంలోనే XM, XZ+వేరియంట్లకు రూ.1.50లక్షల డిస్కౌంట్ ఇచ్చింది. ఇవే కాకుండా ఇతర ఇన్సెంటివ్స్ కూడా ఆఫర్ చేస్తుంది. రోడ్ ట్యాక్స్ మినహాయింపు, రిజిష్ట్రేషన్ ఫీజులను మినహాయించింది. XZ+ ట్రిమ్ వెర్షన్ పై లక్షా 49వేల 900తగ్గింపు ఇచ్చింది. నెక్సాన్ ఈవీ మీద మొత్తానికి రూ.3లక్షల వరకూ డిస్కౌంట్ దొరుకుతుందన్నమాట.

ఈ డిస్కౌంట్ నేరుగా కస్టమర్ బ్యాంక్ అకౌంట్ నుంచే ఉంటుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరో ఆరు వారాల్లో పలు కారణాల కోసం ఎలక్ట్రిక్ వాహనాలనే అద్దెకు తీసుకుంటుందని ప్రకటించింది. అంతేకాకుండా డెలివరీ చైన్స్, పెద్ద కంపెనీలు, మార్కెట్ అసోసియేషన్స్, మాల్స్, మూవీ థియేటర్స్ లాంటి వారందరికీ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేసేలా ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని సూచించింది.