Hop Shoots Cultivation: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట పండిస్తున్న బీహార్ రైతు!

బిహార్‌ లాంటి పేద రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల ఆమ్రేష్ సింగ్ అనే రైతు ప్రపంచంలోనే అత్యంత విలువైన పంటను సాగుచేస్తూ వార్తల్లో నిలిచాడు. అంత కాస్ట్లీ అంటే అదేదో వాణిజ్య పంట అనుకోవచ్చు. కానీ అది కూరగాయల పంట కావడం విశేషం.

Hop Shoots Cultivation: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పంట పండిస్తున్న బీహార్ రైతు!

Shoots Cultivation

Hop Shoots Cultivation: ఇండియాలో వ్యవసాయం.. జూదం ఒకటే అంటుంటారు వ్యవసాయంలో భారీగా నష్టాలను ఎదుర్కొంటున్న రైతులు. ప్రతికూల వాతావరణ పరిస్థితిలను ఎదుర్కొని మరీ ఆరుగాలం శ్రమించి పండించిన పంట తీరా చేతికొచ్చాక ధరల పతనం రైతును కుంగదీస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. దీనికి తోడు ఇప్పటికీ పాత వ్యవసాయ పద్దతులతోనే చేసే సాగు రైతుకు గుదిబండగా మారిందని మనం తరచుగా వింటున్నదే. ఇప్పుడిప్పుడే ఆధునిక వ్యవసాయ విధానాలను అలవరుచుకుంటున్న రైతన్నలు సాంప్రదాయ పంటలతో పాటు విభిన్న పంటలను ఎంచుకుంటున్నారు. మరికొందరు ఔత్సాహిక రైతులు ప్రపంచంలోనే మేలైన పంటలు.. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా అధిక ఆదాయం అందించే పంటలను పండిస్తూ దేశంలో రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

బిహార్‌ లాంటి పేద రాష్ట్రం, వెనుకబడిన రాష్ట్రానికి చెందిన 38 ఏళ్ల ఆమ్రేష్ సింగ్ అనే రైతు ప్రపంచంలోనే అత్యంత విలువైన పంటను సాగుచేస్తూ వార్తల్లో నిలిచాడు. అంత కాస్ట్లీ అంటే అదేదో వాణిజ్య పంట అనుకోవచ్చు. కానీ అది కూరగాయల పంట కావడం విశేషం. అతడు పండించే ప్రత్యేకమైన కూరగాయల ధర పదులు, వందల్లో కాదు ఏకంగా వేలల్లోనే ఉంటుంది. ఇంతకీ ఆ పంట ఏంటంటే హాప్ షూట్స్. మన దేశంలో కొత్తగా వినిపిస్తున్న ఈ పంట ఇతర దేశాలలో ఎప్పటి నుండో సాగులో ఉంది. హాఫ్ షూట్స్ పంట కిలో రూ.85000 వరకు ధర ఉండగా రైతు ఆమ్రేష్ బిహార్‌లోని ఔరంగాబాద్ జిల్లాలోని కరందిహ్ గ్రామంలో ట్రయిల్ బేసిస్ మీద ఈ పంట పండిస్తున్నాడు.

ఇతర ఔషధ, సుగంధ ద్రవ్యాల మొక్కలను కూడా సాగు చేస్తున్న ఆమ్రేష్.. అంతర్జాతీయ మార్కెట్ లో భారీ ధర పలికే హాప్ షూట్స్ గురించి తెలుసుకొని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నుండి హాప్ షూట్స్ కూరగాయల నాట్లు తీసుకొచ్చి సాగు మొదలుపెట్టాడు. కొద్ది విస్తీర్ణంలో వేసిన హాప్ షూట్స్ పంటకు ఈ రైతు రెండున్నర లక్షల పెట్టుబడి పెట్టగా అంతర్జాతీయ మార్కెట్లలో దీని ధర కిలోకు 1000 యూరోల వరకు, మన కరెన్సీలో రూ.85,000 వరకు ఉందట. దీన్ని సాగు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తే బీహార్ లాంటి పేదదేశంలో రైతులకు వరంగా మారి 10 రెట్లు ఎక్కువ ఆదాయం వస్తుందని ఆయన వివరిస్తున్నారు.