Arvind Kejriwal: గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం.. వీడియో వైరల్

కేజ్రీవాల్ కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దొంగ.. దొంగ అంటూ నల్ల జెండాలూ చూపారు. మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ లోని నవసారీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ పైనే పూర్తిగా దృష్టి పెట్టింది.

Arvind Kejriwal: గుజరాత్‌లో కేజ్రీవాల్‌కు చేదు అనుభవం.. వీడియో వైరల్

Arvind Kejriwal: గుజరాత్‌లో కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండడంతో ఆ రాష్ట్రంలో విజయం సాధించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ దృష్టి పెట్టింది. ఆ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్ లో పర్యటిస్తూ హామీలు గుప్పిస్తున్నారు. గుజరాత్ లో ఆయనకు నిన్న చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో కొందరు ఆయనకు వ్యతిరేకంగా ప్రధాని మోదీకి అనుకూలంగా నినాదాలు చేశారు. దొంగ.. దొంగ అంటూ నల్ల జెండాలూ చూపారు.

మోదీ మోదీ అంటూ నినాదాలు చేశారు. గుజరాత్ లోని నవసారీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు గుజరాత్ పైనే పూర్తిగా దృష్టి పెట్టింది. గుజరాత్ లో కేజ్రీవాల్ ఇస్తున్న ‘ఉచితాల’ హామీలపై ప్రధాని మోదీతో పాటు పలువురు అభ్యంతరాలు తెలిపిన విషయం తెలిసిందే.

గుజరాత్ లో ఆప్ పలు వ్యూహాలతో ముందుకు వెళుతోంది. గుజరాత్ అప్ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రజలే నిర్ణయించాలని నిన్న కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఇందు కోసం మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఇచ్చారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో చాలా కాలంగా బీజేపీనే అధికారంలో ఉంటోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..