Shashi Tharoor on G23: కాంగ్రెస్ పార్టీలో జీ23 గ్రూప్ అనేదే లేదు: శశి థరూర్

కాంగ్రెస్ నాయకత్వం, మార్పులు వంటి అంశాలపై గతంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి 23 మంది నేతలు పార్టీలో కలకలం రేపిన విషయాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి అభ్యర్థి శశి థరూర్ జీ-23పై స్పందించారు. ‘‘అసలు జీ-23 అనేదే లేదు. అది మీడియా సృష్టించిన పేరు మాత్రమే’’ అని చెప్పారు. కాగా, జీ-23 గ్రూపులో శశి థరూర్ కూడా ఉన్నారు.

Shashi Tharoor on G23: కాంగ్రెస్ పార్టీలో జీ23 గ్రూప్ అనేదే లేదు: శశి థరూర్

Shashi Tharoor on G23: కాంగ్రెస్ నాయకత్వం, మార్పులు వంటి అంశాలపై గతంలో తమ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసి 23 మంది నేతలు పార్టీలో కలకలం రేపిన విషయాన్ని ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కు వచ్చిన కాంగ్రెస్ అధ్యక్ష పదవి అభ్యర్థి శశి థరూర్ జీ-23పై స్పందించారు. ‘‘అసలు జీ-23 అనేదే లేదు. అది మీడియా సృష్టించిన పేరు మాత్రమే’’ అని చెప్పారు. కాగా, జీ-23 గ్రూపులో శశి థరూర్ కూడా ఉన్నారు.

కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం జరుగుతున్న ఎన్నిక గురించి శశి థరూర్ మాట్లాడుతూ… ‘‘అధికార పార్టీ బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎలా సిద్ధమవుతుందన్న విషయాన్ని ఈ ఎన్నిక స్పష్టం చేస్తుంది. మేము ఇప్పటికే 2 సార్లు లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయాం. పార్టీని పునరుద్ధరించాల్సి ఉంది. బీజేపీని ఎదుర్కొనే విధంగా పార్టీని తయారు చేయాల్సి ఉంది’’ అని అన్నారు. కాగా, కాంగ్రెస్ అధ్యక్ష పదవి రేసులో మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ మాత్రమే నిలిచారు. మల్లికార్జున ఖర్గేకు నెహ్రూ-గాంధీల కుటుంబం మద్దతు ఇస్తుండడంతో ఆయనే గెలుస్తారని ప్రచారం జరుగుతోంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..