Elephant Viral Video: గజరాజుకు కోపం వచ్చింది.. కారును ధ్వంసం చేసింది.. వీడియో వైరల్

ఓ అటవీ ప్రాంతంలో కారును ఏనుగు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బైటెన్జ్‌బియెడెన్ అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోడ్డుపైకి వచ్చిన ఓ ఏనుగు కారును అడ్డుకుంది. మొదట కారు టైరును పగులకొట్టడానికి ప్రయత్నించింది. అనంతరం దానిపైకి ఎక్కుతూ, నెట్టేస్తూ బీభత్సం సృష్టించింది. తన శరీరాన్ని కారుకు రుద్దుతూ దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది.

Elephant Viral Video: గజరాజుకు కోపం వచ్చింది.. కారును ధ్వంసం చేసింది.. వీడియో వైరల్

Elephant Viral Video

Elephant Viral Video: ఓ అటవీ ప్రాంతంలో కారును ఏనుగు ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. బైటెన్జ్‌బియెడెన్ అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. రోడ్డుపైకి వచ్చిన ఓ ఏనుగు కారును అడ్డుకుంది. మొదట కారు టైరును పగులకొట్టడానికి ప్రయత్నించింది. అనంతరం దానిపైకి ఎక్కుతూ, నెట్టేస్తూ బీభత్సం సృష్టించింది. తన శరీరాన్ని కారుకు రుద్దుతూ దాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించింది.

ఏనుగు దాడిలో కారు ముందు భాగం ధ్వంసమైంది. చివరకు ఆ కారులోని వ్యక్తి కారును వెనక్కి తీసుకు వెళ్ళాడు. ఏ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న వివరాలు తెలియరాలేదు. కారును ఏనుగు ధ్వంసం చేస్తుండగా ఒకరు స్మార్ట్ ఫోనులో వీడియో తీయడంతో ఈ ఘటన బయటకు వచ్చింది. ఈ వీడియో చూసి షాక్ అయ్యామని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. గజరాజుకి కోపం వస్తే ఏం చేస్తుందో చూశామని కొందరు కామెంట్లు చేశారు. ఆ కారులోని వ్యక్తి భయంతో వణికిపోయి ఉంటాడని కొందరు పేర్కొన్నారు.

Woman bites fingers: టీవీ సౌండు తగ్గించాలని చెప్పినందుకు అత్త చేతి మూడు వేళ్ళు కొరికేసిన కోడలు