దుమ్ముకొట్టుకుపోయి చెత్తలా పడి ఉన్న కోహ్లీ కారు.. అసలు కథ ఇదే

దుమ్ముకొట్టుకుపోయి చెత్తలా పడి ఉన్న కోహ్లీ కారు.. అసలు కథ ఇదే

Virat Kohli: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ లో కొనుక్కున్న తొలి ఆడి కారు ఎక్కడుందో తెలుసా.. మహారాష్ట్రలోని ఓ పోలీస్ స్టేషన్ లో. దుమ్ముకొట్టుకుపోయి కారు ఎవరిదోననే అనుమానం పుట్టేలా ఉంది. పలుమార్లు అదే కారుతో ఫోజులిచ్చిన విరాట్.. కొత్త ఆర్8రాగానే పాతకారును అమ్మేశాడు. అదే కారు ఇప్పుడు మహారాష్ట్రలో ఓ మూలన దుమ్ముకొట్టుకుని వరదలకు దెబ్బతిని చెత్తలా పడి ఉంది.

దాని మోడల్ 2012 ఆడి ఆర్8. దానిని సాగర్ ఠక్కర్ అనే వ్యక్తికి 2016లో అమ్మాడు. షగ్గీ అలియాస్ సాగర్ ఠక్కర్ కారును గర్ల్ ఫ్రెండ్ ఇచ్చేందుకు కొన్నాడు. ఆ తర్వాత ఓ మెగా స్కాంలో ఇరుక్కుపోయిన అతణ్ని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. కాల్ సెంటర్ స్కామ్ బయటపడిన వెంటనే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాడి చేసిన ముంబై పోలీసులు అతని ఆస్తులన్నింటినీ సీజ్ చేయగా అందులో Audi R8కూడా ఉంది.

అందుకే వెహికల్ అమ్మేసిన వెంటనే సరైన డాక్యుమెంటేషన్ చేయించుకోవాలంటుంటారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీద పేరు మార్చుకోవడం అనేది వాహనం అమ్మేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అలా అయితేనే కొన్ని కేసుల్లో ఇరుక్కుపోకుండా ఉంటాం.

ఆ కారు కొన్న 2నెలలకే సీజ్ అయింది. ప్రస్తుతం ఇది ముంబై పోలీస్ గ్రౌండ్ లో పార్క్ చేసి ఉంచారు. ఇటీవల కురిసిన వరదలు కూడా ఈ ఎఫెక్ట్ కు గురయ్యాయి. అనేక రిపోర్టుల ఆధారంగా వరద నీటిలో తేలియాడుతూ.. కొన్ని చోట్ల బాగా దెబ్బతింది కూడా ఈ కార్. ఇదంటే ఎంత ప్రేమో.. కోహ్లీ చాలా సార్లు చూపించుకున్నాడు. దీని పక్కనే నిలబడి ఫొటోలు తిగుతూ సంతోషాన్ని వ్యక్తంచేసుకునేవాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ దగ్గర Audi R8 LMX. అది కాక పలు లగ్జరీ కార్లు, ఎస్యూవీలు Audi ఇతర మోడల్స్ Q7, RS5, A8L, RS6, S5లాంటివి ఉన్నాయి. వాటితో పాటు విరాట్ కోహ్లీ ముంబై, ఢిల్లీల్లో బెంట్లీ కార్లను వాడుతుంటాడు. ముంబైలో ఉన్నప్పుడల్లా భార్యతో కలిసి బెంట్లీ కారులోనే తిరుగుతుంటాడు కోహ్లీ.