Dalai Lama: మరో 15-20 ఏళ్లు బతుకుతానని.. భారత్‌లో చనిపోవడానికే ఇష్టపడతానని అప్పుడే చెప్పాను: దలైలామా

మరణం గురించి బౌద్ధమత గురువు దలైలామా పలు వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రేమ కురిపించే భారత్ లోనే చనిపోవాలని ఉందని, అంతేగానీ, కృత్రిమ వ్యవహార శైలి ఉండే చైనా అధికారుల మధ్య చనిపోవడం ఇష్టం లేదని అన్నారు. ‘‘భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నేను ఓ విషయం చెప్పాను. నేను మరో 15-20 ఏళ్లు బతుకుతానని, ఇందులో ఏ సందేహమూ లేదని అన్నాను. భారత్ లో తుదిశ్వాస విడవడానికే నేను ఇష్టపడతాను. భారత్ లో ప్రేమను కురిపించే ప్రజలు ఉన్నారు. వారు కురిపించే ప్రేమ కృత్రిమమైనది కాదు’’ అని చెప్పారు.

Dalai Lama: మరో 15-20 ఏళ్లు బతుకుతానని.. భారత్‌లో చనిపోవడానికే ఇష్టపడతానని అప్పుడే చెప్పాను: దలైలామా

Dalai Lama

Dalai Lama: మరణం గురించి బౌద్ధమత గురువు దలైలామా పలు వ్యాఖ్యలు చేశారు. నిజమైన ప్రేమ కురిపించే భారత్ లోనే చనిపోవాలని ఉందని, అంతేగానీ, కృత్రిమ వ్యవహార శైలి ఉండే చైనా అధికారుల మధ్య చనిపోవడం ఇష్టం లేదని అన్నారు. ‘‘భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌కు నేను ఓ విషయం చెప్పాను. నేను మరో 15-20 ఏళ్లు బతుకుతానని, ఇందులో ఏ సందేహమూ లేదని అన్నాను. భారత్ లో తుదిశ్వాస విడవడానికే నేను ఇష్టపడతాను. భారత్ లో ప్రేమను కురిపించే ప్రజలు ఉన్నారు. వారు కురిపించే ప్రేమ కృత్రిమమైనది కాదు’’ అని చెప్పారు.

‘‘నేను చైనా అధికారుల మధ్య చనిపోతే.. వారి కృత్రిమ ధోరణి మాత్రమే కనపడుతుంది. స్వేచ్ఛాయుత భారత్ లో చనిపోవడమే నాకు ఇష్టం. చావు దరిచేరిన సమయంలో నమ్మకస్థులైన మిత్రులే మనచుట్టూ ఉండాలి. వారే నిజమైన భావాలను వ్యక్తపర్చుతారు’’ అని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో దలైలామా చెప్పారు. దలైలామాను వివాదాస్పద వ్యక్తి అంటూ, వేర్పాటువాది అంటూ చైనా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. 1950లో టిబెట్ ను చైనా ఆక్రమించుకుంది. అప్పటి నుంచి దలైలామా భారత్ లో ఆశ్రయం పొందుతున్నారు.

Heavy rains in Hyderabad: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం