China : భూమి పుట్టుక, మార్పులను తెలుసుకునేందుకు.. చైనాలో భూమి లోపలికి 10 కిలోమీటర్ల లోతుగా బోర్ వెల్

ఇది భూభాగం లోతుల్లో కొత్త విషయాలను అన్వేషించడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా ఉన్న వాంగ్ చున్ షెంగ్ పేర్కొన్నారు.

China : భూమి పుట్టుక, మార్పులను తెలుసుకునేందుకు.. చైనాలో భూమి లోపలికి 10 కిలోమీటర్ల లోతుగా బోర్ వెల్

China deep bore well

10 km Deep Bore Well : చైనా మరో భారీ ప్రాజెక్టు చేపట్టింది. భూమి పుట్టుక, కాలక్రమేనా వచ్చిన మార్పులను తెలుసుకోవడానికి భూమి లోపలికి ఏకంగా 10 కిలోమీటర్ల లోతుగా బోర్ వెల్ తవ్వుతోంది. భూమి లోపలి పరిస్థితులపై పరిశోధనలకు గానూ చైనా ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. వాయువ్య చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్ లో గల తారిమ్ బేసిన్ లో ఈ బోర్ వెల్ తవ్వుతోంది.

Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు

ఈ బోర్ వెల్ భూమి లోపలి 10 రాతి పొరల నుంచి చొచ్చుకెళ్లనుంది. భూమి పుట్టుక, కాలక్రమంలో వచ్చిన మార్పులు, జీవ పరిణామాన్ని, గతంలో సంభవించిన భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు, వాతావరణ మార్పులను తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది భూభాగం లోతుల్లో కొత్త విషయాలను అన్వేషించడానికి తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఈ ప్రాజెక్టులో సాంకేతిక నిపుణుడిగా ఉన్న వాంగ్ చున్ షెంగ్ పేర్కొన్నారు.