Coal Mine Collapse : కుప్పకూలిన బొగ్గు గని..14 మంది దుర్మరణం

చైనాలో మరోసారి బొగ్గు గని కుప్పకూలింది. ఈ ఘటనలో 14మంది ప్రాణాలు కోల్పోయారు.

Coal Mine Collapse : కుప్పకూలిన బొగ్గు గని..14 మంది దుర్మరణం

Coal Mine Collapse In China 14 Died

Coal Mine Collapse in China : గనిలో 14మంది ప్రాణాలు బలి అయిపోయాయి. బొగ్గు గనికూలిన ఘటనలో 14మంది దుర్మరణం పాలయ్యాయిన ఘటన చైనాలో చోటుచేసుకుంది. నైరుతి చైనాలోని గుయిజూ ప్రావిన్స్‌లో బొగ్గు గని కుప్పకూలిన ప్రమాదంలో 14 మంది మరణించినట్టు స్థానిక అధికారులు వెల్లడించారు.

సాన్హే షంగ్జన్‌ బొగ్గు గనిలో ఫిబ్రవరి 25న పై కప్పు కూలిపోవడంతో అక్కడే పని చేస్తున్న కార్మికులు చిక్కుకుపోయారు. వెంటనే సహాయ సిబ్బందిని రంగంలోకి దించారు. వారం రోజులు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నా ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంది.ఈ ప్రమాదంలో 14 మంది చనిపోగా..వారి మృతదేహాలు ఆదివారం (మార్చి 6,2022)బయటపడ్డాయి. చైనాలో బొగ్గు గని ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయి. ఎంతోమంది కార్మికులు ఈ గనుల్లో సజీవ సమాధి అయిపోతున్నారు. ఈ క్రమంలో 10 రోజుల క్రితం నైరుతు చైనాలో ఓ బొగ్గు గని కూలిపోయింది.

దీంతో అధికారులు గనిలో చిక్కుకుపోయినవారిని కాపాడటానికి 10రోజులుగా యత్నాలు ముమ్మురంగా కొనసాగించారు. కానీ 14మంది ప్రాణాలు కోల్పోవటం జరిగింది. గని ప్రవేశ ద్వారం నుండి దాదాపు 3 కిలోమీటర్లు (1.9 మైళ్ళు) పైకప్పు కూలిపోయింది. కూలిపోయిన పైకప్పు చాలా పెద్దదిగా ఉండటంతో గనిలో చిక్కుకున్నవారిని కాపాడటానికి రెస్క్యూ ఆపరేషన్ సవాలుగా మారింది. ఈ క్రమంలో 14మంది ప్రాణాలు కోల్పోయారని ఆదివారం వెల్లడించారు.