Google : గూగుల్ లో 2/3 మోడల్ పని దినాలు

కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల పని విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. గూగుల్ ఉద్యోగుల కోసం 2/3 మోడల్‌ను సుందర్ పిచాయ్ ప్రతిపాదించారు. అయితేప్రస్తుతానికి అమెరికాలోనే అమలు చేయనున్నారు.

Google : గూగుల్ లో 2/3 మోడల్ పని దినాలు

Google

New policy on working days at Google : కరోనా వైరస్ కారణంగా ఉద్యోగుల పని విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఇందులో ముఖ్యంగా ‘వర్క్ ఫ్రం హోం’కు విస్తృత ప్రచారం లభించింది. చాలా కార్యాలయాల్లో ‘వర్క్ ఫ్రం హోం’ విధానాన్ని కూడా అమలు చేశారు. అయితే కరోనా ప్రభావం తగ్గుతున్న కొద్దీ ఉద్యోగుల పని విధానాన్ని నిర్ణయించడంలో యాజమాన్యాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి.

ఇటు వర్క్ ఫ్రం హోం ఇవ్వలేక, అటు ఆఫీసుల్లో పని చేయించుకునే వీల్లేలేక సతమతమవుతున్నాయి. అయితే ఉద్యోగుల ఫ్లెక్సిబుల్ వర్కింగ్ మెథడ్‌కు గూగుల్ కొత్త పరిష్కారాన్ని కనుగొంది. ఇది ఎంత వరకు ఫలితాన్ని ఇస్తుందనేది ఇప్పట్లో చెప్పలేమని, అయితే తప్పనిసరిగా ఆశాజనికమైన ఫలితాలే వస్తాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పేర్కొన్నారు.

Sourav Ganguly: భారత్ గెలిచి ఎనిమిదేళ్లు.. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ గురించి సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?

ప్రస్తుతం గూగుల్‌లో ఐదు రోజుల పని దినాలు అమలులో ఉన్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం, వర్క్ ఫ్రం ఆఫీసు విషయాల్లో స్పష్టత లేదు. కాగా గూగుల్ ఉద్యోగుల కోసం 2/3 మోడల్‌ను సుందర్ పిచాయ్ ప్రతిపాదించారు. దీని ప్రకారం రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉండగా, మూడు రోజులు ఇంటి నుంచి పని చేసుకోవచ్చు.

కరోనా కారణంగా ఏడాది నుంచి చాలా మంది ఉద్యోగులు రిమోట్ ఏరియాల్లో ఉన్న వారి ఇంటి నుంచి పని చేస్తున్నారని, ఇప్పుడు వారు ఆఫీసు వరకు వచ్చి పని చేయడం కష్టమనే కారణంతోనే ఈ నూతన విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. అయితే ఇది ప్రస్తుతానికి అమెరికాలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు. అమెరికాలో ఫలితాలను బట్టి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగులకు వర్తింపజేయనున్నట్లు సుందర్ పిచాయ్ తెలిపారు.