Sourav Ganguly: భారత్ గెలిచి ఎనిమిదేళ్లు.. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ గురించి సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?

ప్రతిష్టాత్మక టీ20 మ్యాచ్‌లు ఇవాళ(23 అక్టోబర్ 2021) నుంచి మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉండనున్నాయి.

Sourav Ganguly: భారత్ గెలిచి ఎనిమిదేళ్లు.. ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌తో మ్యాచ్ గురించి సౌరవ్ గంగూలీ ఏం చెప్పారు?

Ganguly

Sourav Ganguly: ప్రతిష్టాత్మక టీ20 మ్యాచ్‌లు ఇవాళ(23 అక్టోబర్ 2021) నుంచి మ్యాచ్‌లు ఆసక్తికరంగా ఉండనున్నాయి. ఇవాళ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరగనుండగా.. రేపు(24 అక్టోబర్ 2021) ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పాకిస్తాన్, భారత్ మ్యాచ్.. ప్రపంచకప్‌లో భారత జట్టు ఈ మ్యాచ్‌లోనే ఆరంగ్రేటం చేయనుంది.

భారత్‌ తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌తోనే.. ఈ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. భారత్-పాకిస్తాన్‌ మధ్య జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 ప్రపంచ కప్‌లో ఈ మ్యాచ్‌ల గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఓ నేషనల్ మీడియా ఛానెల్‌లో మాట్లాడారు.

గత ఎనిమిదేళ్ల నుంచి భారత జట్టు ఏ ఐసీసీ టోర్నమెంట్‌ను గెలవలేదా? అనే దానిపై సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ, “ఏ దేశం కూడా ఎప్పుడూ గెలవలేదు.. కానీ, పోరాటం మాత్రం చెయ్యగలగాలి. భారత్ ఎప్పుడూ ఆ విషయంలో వెనకడుగు వెయ్యలేదు. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలవగా.. 2007లో టీ 20 వరల్డ్ కప్ గెలిచింది. 2003లో వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌ను భారత్ ఆడింది. ఆ తర్వాత 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడింది 2017లో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఓడిపోయింది. ఆ తర్వాత 2019లో వరల్డ్ కప్ సెమీఫైనల్ ఆడింది. ప్రతి ఏడాది భారత్‌ పోరాటం చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మా జట్టు కచ్చితంగా పోరాటం చేస్తుంది.” అని అన్నారు.

ఈ ఏడాది భారత జట్టు చాలా బలంగా ఉందని, ఫైనల్ వెళ్లే అవకాశం ఉందని, పెద్ద మ్యాచ్‌లు బాగా ఆడినప్పుడు.. ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్‌లు జాగ్రత్తగా ఆడినప్పుడే టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలుస్తుంది. ఆటగాళ్లపై ఎటువంటి ఒత్తిడి లేదు. నేను స్వేచ్ఛగా ఆడాలని చెప్పాను. ఈ ఫార్మాట్‌లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. భయం లేకుండా స్వేచ్ఛగా ఆడినప్పుడే భారత్ గెలుపు అవకాశాలు పెరుగుతాయి.

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ల విషయంలో భారత్‌కు మంచి రికార్డు ఉంది. కానీ, ఛాంపియన్ ట్రోఫీ ఓడిపోయిన సంధర్భం కూడా ఉందని అన్నారు సౌరవ్ గంగూలీ. ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ కోసం టిక్కెట్‌ల డిమాండ్ భారీగా ఉంది. దుబాయ్‌లో జరిగే ఈ మ్యాచ్ చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్నారు. కోవిడ్ కూడా దాదాపుగా తగ్గడంతో స్టేడియంకు వచ్చేందుకు ప్రేక్షకులు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. అని అన్నారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌ అంటే, స్టార్.. సౌరవ్ గంగూలీనే.. పాకిస్తాన్‌పై గంగూలీకి మంచి రికార్డు ఉంది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ, “నేను పాకిస్తాన్, ఆస్ట్రేలియా, జింబాబ్వే, శ్రీలంక, బంగ్లాదేశ్ ఏ దేశంతోనైనా మ్యాచ్‌ని ఒకేలా చూసేవాడిని” అని అన్నారు.