అప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఎగ్జామ్‌లో జీరో..నేడు ఆస్ట్రోఫిజిసిస్ట్

  • Published By: madhu ,Published On : November 24, 2019 / 06:27 AM IST
అప్పుడు క్వాంటమ్ ఫిజిక్స్ ఎగ్జామ్‌లో జీరో..నేడు ఆస్ట్రోఫిజిసిస్ట్

పట్టుదల, ఆసక్తి, కృషి ఉంటే ఏదైనా సాధ్యమేనని నిరూపించిందో యువతి. చదువుకొనే రోజుల్లో ఫెయిల్ అయినా..తర్వాతి కెరీర్‌లో అద్బుత విజయాలు సాధిస్తూ దూసుకెళుతున్న వారిలో ఈమె కూడా ఒకరు. క్వాంటమ్ ఫిజిక్స్ ఎగ్జామ్‌లో జీరో వస్తే..అదే సబ్జెక్టులో రాణించాలని పట్టుదలతో చదివింది. నేడు టాప్ ఆస్ట్రోఫిజిక్స్ PHD ప్రోగ్రామ్‌లో ఎన్‌రోల్ అయి..రెండు పేపర్లు పబ్లిష్ చేసింది.

దీనికి సంబంధించి ఆమె చేసి ఓ ట్వీట్ ఎంతో మందిని కదిలించింది. తాము కూడా ఇలాగే సక్సెస్ సాధించామని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఈ ట్వీట్‌ను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ రీ ట్వీట్ చేశారు. సారాఫినా నాన్స్ క్యాలిఫోర్నియా బెర్కెలీ నగరానికి చెందిన 26 ఏళ్ల అమ్మాయి. ఆస్టో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతోంది. ఇది చదవడం అంత సులువు కాదు. అందులోనూ ఫిజిక్స్ సబ్జెక్ట్ గురించి అవగాహన కలిగి ఉండాలి. కాలేజీలో చదువుకొనే రోజుల్లో నిర్వహించిన పరీక్షల్లో క్వాంటమ్ ఫిజిక్స్ సబ్జెక్టులో సారాకు సున్నా మార్కులు వచ్చాయి. దీనితో ఫిజిక్స్ చదవడం మానేయాలని అనుకుంది.
 

కానీ పట్టుదలతో చదవాలని ఓ నిర్ణయానికి వచ్చింది. అన్నట్లుగానే రాణించింది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఒకటైన ఆస్ట్రో ఫిజిక్స్‌లో పీహెచ్‌డీ చదువుతున్నట్లు, ఇప్పటికే ఇందులో రెండు పేపర్స్ ప్రచురితమయ్యాయని ట్వీట్‌లో తెలిపింది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) అంటే చాలా మంది కఠినమైన సబ్జెక్టుగా భావిస్తుంటారని వెల్లడించింది. దీనిలో ప్రవేశించడానికి వారు అనర్హులు అని కాదు..అంటూ స్పూర్తిదాయక సందేశాన్ని సైతం అందించింది సారాఫినా. నవంబర్ 21న సారా చేసిన ట్వీట్ రెండు రోజుల్లోనే 85 వేల లైక్స్ రాగా..17 వేల మంది కామెంట్స్ చేశారు. 

 

ఇలా ట్విట్టర్‌లో సారా చేసిన ట్వీట్ యువతలో స్పూర్తి నింపుతోంది. ఈ ట్వీట్ చేసిన గూగుల్ సీఈవో..సుందర్ పిచాయ్ కంట్లో పడింది. చాలా బాగా చెప్పారు..మీ అనుభవం సూర్తిదాకయంగా ఉందంటూ రీ ట్వీట్ చేశారాయన.