ప్రపంచంలో అత్యంత ఖరీదైన విస్కీ.. రూ.25కోట్లకు పైనే

విస్కీ బాటిల్ ఖరీదు పాత పడితే కొలదీ పెరుగుతుందని తెలుసుకానీ, కోట్ల రూపాయల్లో కాస్ట్ ఉంటుందని తెలుసా. ఆల్కహాల్ క్యాటగిరీలో లక్షలు, కోట్లకు అమ్ముడుపోయే లిక్కర్ గురించి సరదాగా ఓ లుక్కేయండి. వాటి టేస్ట్, తయారుచేసిన ప్రోసెస్, అందులో కలిపిన ముడిపదార్థాలు వీటి కాస్ట్ ను పెంచేస్తాయి.

ప్రపంచంలో అత్యంత ఖరీదైన విస్కీ.. రూ.25కోట్లకు పైనే

5 most expensive alcohols

Expensive alcohols: విస్కీ బాటిల్ ఖరీదు పాత పడితే కొలదీ పెరుగుతుందని తెలుసుకానీ, కోట్ల రూపాయల్లో కాస్ట్ ఉంటుందని తెలుసా. ఆల్కహాల్ క్యాటగిరీలో లక్షలు, కోట్లకు అమ్ముడుపోయే లిక్కర్ గురించి సరదాగా ఓ లుక్కేయండి. వాటి టేస్ట్, తయారుచేసిన ప్రోసెస్, అందులో కలిపిన ముడిపదార్థాలు వీటి కాస్ట్ ను పెంచేస్తాయి.

ఒకవేళ మీరూ స్మూత్, స్ట్రాంగ్ లేదా క్లాసిక్ టైమ్స్ విస్కీలు టేస్ట్ చేయాలనుకుంటే మీ కోసమే ఈ కలెక్షన్.


Glenfiddich’s 50-year-old Single Malt Scotch
50 సంవత్సరాల క్రితం నాటి గ్లెన్ఫిడ్డిచ్ సింగిల్ మాల్ట్ స్కాచ్ విస్కీ.. ఎంత స్పెషలో తెలుసా.. ప్రతి సంవత్సరానికి ఆ కంపెనీ రిలీజ్ చేసే బాటిల్స్ కేవలం 50మాత్రమే. ఈ డిమాండ్‌ను బట్టి బాటిల్ ధర ఎంతంటే.. పది లక్షల 53వేల 23రూపాయలు.

1926 Macallan Fine & Rare Collection
మకల్లన్ రేర్ కలెక్షన్ బాటిల్ ఈ ఓల్డ్ విస్కీ. 42.6శాతం ఆల్కహాల్ ఉన్న ఈ బాటిల్స్ కేవలం 40మాత్రమే మార్కెట్లోకి వచ్చాయి. లికోరైస్ టేస్ట్ తో వాటర్ అస్సలు కలపకుండా ఉంటుంది. దీని ఖరీదు సుమారు రూ.54లక్షలు 55వేల 702.

62-year-old Dalmore Scotch Whisky
ప్రపంచంలోనే సున్నితమైన విస్కీలలో డాల్మొరె ఒకటి. వేలం నిర్వహించి మొత్తం మీద 62 బాటిల్స్ మాత్రమే అమ్ముడు అయ్యాయి. దీని ధర సుమారు రూ.2కోట్ల 43 లక్షల 77వేల 950.

Henri IV Dudognon Heritage Cognac
100ఏళ్ల నాటి హెన్రీ ఫోర్ డ్యుబోగ్నన్ హెరిటేజ్ కొగ్నాక్ అత్యంత అరుదైన విలువైన విస్కీ. ఇంకా ఈ బాటిల్ పై 24క్యారెట్ల గోల్డ్, స్టెర్లింగ్ ప్లాటినంతో పాటు 6వేల 500 వజ్రాలను పొదిగారు. 1776లో తయారైన ఈ బాటిల్ బరువు 8కేజీలు. దీని లైఫ్ వందేళ్లకు పైనే. దీని ధర సుమారు రూ.14కోట్ల 56లక్షల 93వేలు ఉంది.


Tequila Ley 295 Diamante
టకీలా.. ఫ్లేవర్లతో నిండిపోయి, ఆరోమాతో ఉన్న ఖరీదైన, విలువైన, అత్యంత అద్భుతమైన బాటిల్. ప్రస్తుతం దీని ఖరీదు రూ.25కోట్ల 48లక్షల 26వేల 250గా ఉండొచ్చు. లోపలి టేస్ట్ ఎలా ఉన్నా.. 4వేల 100వైట్ డైమండ్స్ తో పొదిగారు.