US Cruise Ship : యూఎస్ క్రూయిజ్ షిప్‌లో 58 మందికి కొవిడ్ పాజిటివ్

ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్‌గా పేరుగాంచిన రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్‌ లో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది.

US Cruise Ship : యూఎస్ క్రూయిజ్ షిప్‌లో 58 మందికి కొవిడ్ పాజిటివ్

55 People Test Positive For Covid On Us Cruise Ship

Updated On : December 24, 2021 / 9:27 AM IST

US Cruise Ship : సముద్రం మధ్యలోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్ద క్రూజ్ షిప్‌గా పేరుగాంచిన రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్‌ లో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. ది రాయల్ కరేబియన్ సింఫనీ ఆఫ్‌సీన్ కరోనా క్లస్టర్‌గా మారిపోయింది. ఆగ్నేయ యుఎస్ రాష్ట్రం ఫ్లోరిడా నుంచి బయలుదేరిన రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్‌లో 55 మంది కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్టు కంపెనీ పేర్కొంది. (Odyssey of the Seas)లో కరోనా ఇన్ఫెక్షన్ల సంఖ్య పెరిగిపోతోంది. ఈ షిప్‌లో సిబ్బంది, ప్రయాణికులతో కలిపి మొత్తంగా 6వేల మంది ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు బయటపడటంతో నౌకను ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో నిలిపివేశారు. కరోనా బాధితుల శాంపిల్స్‌ను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపారు. క్రూయిజ్ షిప్‌లో ఉన్న 95 శాతం మంది ప్రయాణికులకు కరోనావైరస్ టీకాలు తీసుకున్నవారే ఉన్నారు.

అయినప్పటికీ కరోనా కేసులు పెరగడంతో క్రూయిజ్ షిప్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇంతకీ అది క‌రోనా పాజిటివ్‌నా లేక ఒమిక్రాన్ వేరియంటా అనేది తేలాల్సింది. మరికొందరికి టెస్టులను ఫ్లోరిడా అధికారులు నిర్వహిస్తున్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. కరోనా సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. షిప్.. కరేబియన్ దీవులైన కురాకో, అరుబా వద్ద నిలపలేదు. ఎనిమిది రోజుల ప్రయాణంలో చివరి షెడ్యూల్ స్టాప్‌లు ఉన్నాయి.. డిసెంబర్ 26న ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌కు తిరిగి వచ్చే వరకు ఈ నౌక సముద్రంలోనే ఉండనుంది. ఒడిస్సీలో 3,587 మంది ప్రయాణికులు,1,599 మంది సిబ్బంది ఉన్నారు. సోకిన వారిలో మొత్తం 55 మందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారని, వైరస్ లక్షణాలను పరిశీలిస్తే.. చాలామందిలో లక్షణరహితంగా లేదా తేలికపాటి లక్షణాలను కలిగి ఉన్నారని షిప్పింగ్ కంపెనీ వెల్లడించింది.

కోవిడ్ టెస్టుకు ముందు బాధితుల సన్నిహితులు 24 గంటల పాటు క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు పేర్కొన్నారు. రాయల్ కరేబియన్ క్రూయిజ్ షిప్‌లో వారంలోపే రెండోసారి కరోనా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. గత శనివారం ‘సింఫనీ ఆఫ్ ది సీస్’ కరేబియన్‌లో ఏడు రోజుల సముద్రయానం తర్వాత 48 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆ తర్వాత మయామి నౌకాశ్రయానికి షిప్ తిరిగి వచ్చింది. 2020లో మహమ్మారి ప్రారంభ నెలల్లో ప్యాసెంజర్ షిప్‌ల్లో కరోనావైరస్ వ్యాప్తి తీవ్రంగా పెరిగింది. దీని ప్రభావంతో ఏడాదిలో పైగా క్రూయిజ్ కార్యకలాపాలను నిలిచిపోయేలా చేసింది. రాయల్ కరేబియన్‌ షిప్‌లో ప్రయాణించే 12 ఏళ్లు పైబడిన ప్రయాణీకులు, ఉద్యోగులు పూర్తిగా టీకాలు తీసుకోవడం తప్పనిసరి.. కానీ, ఇప్పుడు Omicron వేరియంట్ పరిశ్రమకు కొత్త సవాలును విసురుతోంది.

Read Also : Cruise Ship : క్రూజ్‌ షిప్పులో 48 మందికి క‌రోనా పాజిటివ్‌