US Earthquake : అలాస్కాలో 8.2 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. అలస్కా ద్వీపంలో 8.2 తీవ్రతతో భూకంపం సంభవించటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు.

US Earthquake : అలాస్కాలో 8.2 తీవ్రతతో భూకంపం..సునామీ హెచ్చరికలు జారీ

8.2 Magnitude Earthquake Strikes Alaskan

8.2 Magnitude Earthquake Strikes Alaskan : అమెరికాలో మరోసారి భూకంపం సంభవించింది. అలస్కా ద్వీపంలో బుధవారం (జులై 28,2021) భూకంపం సంభవించగా..దాని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 8.2 గా నమోదు కావటంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి 10.15 గంటల సమయంలో పెర్రివిల్లెకు తూర్పు-ఆగ్నేయంలో 56 మైళ్ల (91 కిలోమీటర్లు) దూరంలో, భూమికి 29 మైళ్ల లోపతులో సంభవించిన భూకంప కేంద్రాన్ని యునైటెడ్‌ స్టేట్స్‌ జియోలాజికల్‌ సర్వే పేర్కొంది. ఈ భూకంపం వల్ల ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ఆ తరువాత అదే ప్రాంతంలో అదే ప్రాంతంలో రిక్టర్‌ స్కేలుపై 6.5.. 5.6 తీవ్రతతో మరో రెండుస్లారు భూమి కంపించిందని పేర్కొంది. దీంతో జాతీయ సునామీ హెచ్చరికల కేంద్రం దక్షిణ ప్రాంతంతో పాటు, ఫసిఫిక్‌ తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. యూఎస్‌ హవాయి, ఇతర అమెరికా, కెనడియన్‌ ఫసిఫిక్‌ తీర ప్రాంతాలకూ సునామీ ముప్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నట్లు సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అయితే, భూ ప్రకంపనలతో ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి నివేదికలు అందలేదని అధికారులు తెలిపారు. కాగా 1964లో 9.2 తీవ్రతతో ఇక్కడ భూకంపం సంభవించింది. ఇది ఉత్తర అమెరికాలో ఇప్పటి వరకూ నమోదైన అతి తీవ్రమైన భూకంపం అని అధికారులు తెలిపారు.దీని తీవ్రత అలాస్కా గల్ఫ్, యూఎస్ పశ్చిమ తీరాన్ని తీవ్రంగా నష్టపరిచింది.