ఈ గ్రహం వయస్సు 1000 కోట్ల ఏళ్లు… ఇదో సూపర్ ఎర్త్.. జీవం ఉందంట!

ఈ గ్రహం వయస్సు 1000 కోట్ల ఏళ్లు… ఇదో సూపర్ ఎర్త్.. జీవం ఉందంట!

Super-Earth Has Been Found In Our Galaxy : అంతరిక్షంలో ఓ పురాతన రాతిగ్రహం బయటపడింది. అచ్చం మన భూగ్రహంలానే ఉంది. అదో సూపర్ ఎర్త్ అంటున్నారు ఖగోళ సైంటిస్టులు. చూడటానికి సూర్యునిలా ఎర్రగా పొగలు గక్కుతూ మండిపోతున్న గోళంలా కనిపిస్తోంది. మన పాలపుంతలో ఈ కొత్త గ్రహం ఈనాటిది కాదంట.. ఎన్నో బిలియన్ల సంవత్సరాల క్రితం గ్రహంగా చెబుతున్నారు.

అంటే.. దాదాపు ఈ గ్రహం వయస్సు 1000 కోట్ల సంవత్సరాలు ఉంటుందని ఖగోళ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు.. మన భూమికి 280 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ పురాతన గ్రహం (TOI-561b) రాతి ప్రపంచం.. ఇది భూమికి మూడంతలు పెద్దదిగా ఉంటుంది. ఇది కేవలం 10.5 గంటల్లో దాని స్టార్ కక్ష్యలో తిరుగుతుంది.

మన గెలాక్సీలోని ప్రధాన నక్షత్రాలకు మొదట నుంచే 10 బిలియన్ల ఏళ్ల వయస్సు ఉన్న ఈ గ్రహం ప్రకాశిస్తోంది. సౌర వ్యవస్థ కంటే రెండు రెట్లు పాతదని భావిస్తున్నారు. పాలపుంత సుమారు 12 బిలియన్ ఏళ్ల నాటి పురాతనమైనది.

TOI-561b ధృవీకరణ ప్రకారం.. విశ్వంలో చాలా వరకు రాతి గ్రహాలు ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. TOI-561b అనేది పురాతన రాతి గ్రహాలలో ఒకటిగా చెబుతున్నారు. 14 బిలియన్ ఏళ్ల క్రితం విశ్వం ప్రారంభమైనప్పటి నుండి రాతి గ్రహాలు ఉన్నాయని ఈ గ్రహం ఆధారంగా అంచనా వేస్తున్నారు ఖగోళ సైంటిస్టులు.

గత 10 బిలియన్ ఏళ్లుగా రాతి గ్రహాలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. బహుశా మన గెలాక్సీ చరిత్రలో మొత్తం 12 బిలియన్ ఏళ్లుగా చెబుతున్నారు.  మన అంతరిక్షంలో TOI-561b, TOI-561c, TOI-561d అనే మూడు పురాతన రాతిగ్రహాలను ఖగోళ సైంటిస్టులు కనుగొన్నారు. Transiting Exoplanet సర్వే శాటిలైట్ (TESS), స్పెస్ టెలిస్కోప్, కెక్ అబ్జర్వేటరీ ద్వారా నాసా గ్రహాలపై అన్వేషణ చేస్తుంటుంది.