Viral Video: హృదయాన్ని కదిలించే వీడియో.. కూతురు ప్రేమకు కన్నీరు పెట్టుకున్న తండ్రి.. చిన్నారి చర్యకు నెటిజన్లు ఫిదా..

ఓ తండ్రిపట్ల కూతురు చూపిన ప్రేమకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది పాత వీడియోనే అయినా.. గత మూడు రోజుల క్రితం ఓ వ్యక్తి పీపుల్ అనే పేరు కలిగిన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. వీడియోను చూసిన నెటిజన్లు తండ్రి పట్ల కూతురు చూపిన ప్రేమకు ఫిదా అవుతున్నారు.

Viral Video: హృదయాన్ని కదిలించే వీడియో.. కూతురు ప్రేమకు కన్నీరు పెట్టుకున్న తండ్రి.. చిన్నారి చర్యకు నెటిజన్లు ఫిదా..

Viral Video

Viral Video: పిల్లలు ఎంత అల్లరిచేస్తారో.. అంతేస్థాయిలో కుటుంబ సభ్యులు బాధలో ఉన్నప్పుడు వారి అద్భుతమైన ప్రేమతో బాధలు మర్చిపోయేలా చేస్తారు. ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరోనా మహమ్మారి సమయంలో చాలా మంది వ్యాపారులు కష్టమైన కాలాన్ని ఎదుర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమయ్యారు. మనకు కనిపిస్తున్న వీడియోలో రెస్టారెంట్ లో బాధతో తలకిందకు వాల్చి కూర్చున్న తండ్రికి స్వెర్టర్ కప్పి ఆ చిన్నారి నెటిజన్లు హృదయాలను కదిలించింది.

Pet Cats Video: ప్లేగ్రౌండ్ కాదమ్మా..! క్రిస్మస్ ట్రీపై దాగుడుమూతలాడుకున్న పిల్లులు.. వీడియో వైరల్

పీపుల్ మ్యాగజైన్ ప్రకారం.. ( ఈ వీడియో ఎక్కడది అనే విషయాన్ని పేర్కొనలేదు) వాంగ్.. ఓ రెస్టారెంట్ యజమాని. మహమ్మారి సమయంలో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ ఆ ఆర్థిక ఇబ్బందుల నుంచి తేరుకోలేక పోయాడు. అయినా రెస్టారెంట్ ను ఎంతో శ్రమకోర్చి నిర్వహిస్తున్నాడు. వాంగ్ తన రెస్టారెంట్ పనిపూర్తిచేసుకున్న తరువాత కొంచెం విరామం తీసుకున్నాడు. తన చేతులను టేబుల్ పై పెట్టి తలను చేతులపై ఆనించి విశ్రాంతి తీసుకున్నాడు. వాంగ్ నిద్రపోతున్న సమయంలో అతని చిన్న కుమార్తె కిచెన్ గదిలోకి వచ్చింది. తండ్రి నిద్రపోతుండటాన్ని చూసి.. నెమ్మదిగా తండ్రి వద్దకు వెళ్లి తండ్రి భుజంపై స్వెర్టర్ కప్పింది. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంచెంసేపటి తరువాత వాంగ్ లేచిచూడగా వీపుపై స్వెర్టర్ ఉంది. తన కూతురు తనకు మరింత ఉపశమనం కలిగించేందుకు స్వెర్టర్ వేసిందని గుర్తించాడు. తన కూతురు చూపిన ప్రేమకు కన్నీరు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది..

 

View this post on Instagram

 

A post shared by People Magazine (@people)

ఈ వీడియోను చూసిన చాలా మంది తమదైన రీతిలో స్పందిస్తు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఓ నెటిజన్.. ‘చిన్నారి తన తండ్రి ఒత్తిడిలో విశ్రాంతి తీసుకుంటుండటాన్ని అర్థం చేసుకొని గొప్పగా ప్రవర్తించింది. ఇలాంటి ఘటన ఒక్కటిచాలు మన ఇబ్బందులను, శారీరక శ్రమను మర్చిపోయేందుకు అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్.. మనం బాధలో ఉన్నప్పుడు మనలో ఉత్సాహాన్ని నింపేందుకు ఇలాంటి ఘటన ఒక్కటి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు. ఓ నెటిజన్.. వాంగ్ రెస్టారెంట్‌కు మద్దతు ఇవ్వాలనే బలమైన కోరికను వ్యక్తపర్చాడు. ఈ రెస్టారెంట్ ఎక్కడ ఉంది? నేను వెళ్లి అతని వ్యాపారంకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నాను.. అంటూ రాశాడు.