Pet Cats Video: ప్లేగ్రౌండ్ కాదమ్మా..! క్రిస్మస్ ట్రీపై దాగుడుమూతలాడుకున్న పిల్లులు.. వీడియో వైరల్

ఇంట్లో పెంపుడు జంతువులు మనల్ని ఓ పట్టాన కూర్చోనివ్వవు. ఇక పిల్లులు అయితే అవిచేసే సందడేవేరు. అందులోనూ రెండు పెంపుడు పిల్లులు ఉంటే వాటి అల్లరికి అడ్డుకట్ట వేయటం కష్టమే.

Pet Cats Video: ప్లేగ్రౌండ్ కాదమ్మా..! క్రిస్మస్ ట్రీపై దాగుడుమూతలాడుకున్న పిల్లులు.. వీడియో వైరల్

Viral Video

Pet Cats Video: ఇంట్లో పెంపుడు జంతువులు మనల్ని ఓ పట్టాన కూర్చోనివ్వవు. ఇక పిల్లులు అయితే అవిచేసే సందడేవేరు. అందులోనూ రెండు పెంపుడు పిల్లులు ఉంటే వాటి అల్లరికి అడ్డుకట్ట వేయటం కష్టమే. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో రెండు పెంపుడు పిల్లులు ఏకంగా క్రిస్మస్ ట్రీపైనే దాగుడుమూతలు ఆడుకున్నాయి. ఆ ట్రీని ఓ ప్లేగ్రౌండ్ గా మార్చేశాయి.

Elephant Angry: ఏనుగుకు కోపమొచ్చింది.. మావటివాడిని ఎత్తికుదేసిన ఏనుగు.. పరుగు పెట్టిన కొత్త జంట.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో 33 సెకన్ల నిడివి కలిగిన వీడియోలో రెండు పిల్లులు క్రిస్మస్ చెట్టును దాదాపుగా పాడు చేయడం కనిపించింది. వీడియో ప్రారంభంలో పిల్లులు క్రిస్మస్ చెట్టు చుట్టూ ఆడుకోవడం కనిపిస్తుంది. ఒకరి కోసం మరొకరు వెతకడం తర్వాత, అవి క్రిస్మస్ చెట్టు పైకి పరుగెత్తడం కనిపిస్తుంది. చెట్టు పైభాగంలో ఉన్న ఒక పిల్లి, దాని నుండి వేలాడుతున్న ఆభరణాలు, దండలు, బాబుల్స్, మిఠాయి కర్రలతో శబ్దం చేస్తూ పడిపోయింది. ఈ వీడియోను బ్యూటెంగేబిడెన్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియోకు “ఇది సీజన్..” అనే క్యాప్షన్‌ ఇచ్చాడు.

ట్విట్టర్‌లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ వీడియో దాదాపు 35వేల మంది వీక్షకులు వీక్షించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 27వేల మంది కంటే ఎక్కువ మంది నెటిజన్లు తమ చమత్కారమైన వ్యాఖ్యలతో తమ అభిప్రాయాలను పంచుకున్నారు.