Viral News: వరుడు కావాలంటూ ప్లకార్డుతో రోడ్డెక్కిన యువతి

నాకు భర్త కావాలి అంటూ రోడ్డెక్కిన సంఘటనలు మనం ఎక్కడ చూడలేదు. అలాంటి ఘటనే సుడాన్‌లో జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Viral News: వరుడు కావాలంటూ ప్లకార్డుతో రోడ్డెక్కిన యువతి

Viral News

Viral News: సాధారణంగా పెళ్లిళ్లు చేసుకునేవాళ్లు..సంబంధాల కోసం మనకి తెలిసినవాళ్లను, బంధువులను చూడమని చెబుతాము. లేదా కొన్ని సందర్భాల్లో వధువు కావాలని పేపర్లనూ, షాదీ డాట్‌ కమ్‌ వంటి యాప్స్‌లో ప్రకటనలు ఇస్తాము. అన్నీ కుదిరితే పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తారు. కానీ ఇప్పటివరకు ఏ యువతీ..నాకు భర్త కావాలి అంటూ రోడ్డెక్కిన సంఘటనలు మనం ఎక్కడ చూడలేదు. అలాంటి ఘటనే సుడాన్‌లో జరిగింది. ప్రస్తుతం ఆ యువతికి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

Viral News : చంటిబిడ్డను ఎత్తుకుని..టీవీ లైవ్‌లో రిపోర్టింగ్

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న యువతిని చూడండీ. నల్లటి మాస్కు ధరించి..ప్లకార్డు పట్టుకుని వరుడ్ని వెతుక్కునే పనిలో పడింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. వరుడు కావాలి. గతంలో పెళ్లైనా పర్వాలేదు చేసుకునేందుకు సిద్ధమే అనే వ్యాఖ్యాలతో కూడిని ప్లకార్డును చేతిలో పట్టుకుని సూడన్‌ రోడ్లుపై తిరుగుతోంది. అంతేకాదు ఇంట్రెస్ట్‌ ఉన్నవారు ఎవరైనా తనను సంప్రదించవచ్చని ఫోన్‌ నెంబర్‌ కూడా ప్లకార్డుపై రాసి పెట్టింది. ఇందుకు కారణం ఎంటో తెలిస్తే షాక్‌ అవుతారు.

Viral News: రైలు వస్తుండగా 9 నెలల చిన్నారితో సహా పట్టాలపై పడిపోయిన తల్లి

సూడన్‌లో మ్యారేజ్‌ లేటు గణనీయంగా తగ్గిపోయింది. 2018తో పోల్చితే 2020 సంవత్సరానికి 21 శాతానికి పడిపోయిందని అక్కడి ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అంతేకాదు 2020లో 60వేలకుపైగా పెళ్లిళ్లు చేసుకున్న జంటలు విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితులు ఏర్పడ్డానికి కరోనా వైరసే కారణమని అక్కడి నిపుణులు చెబుతున్నారు.