Man Attack : వీర్యం నింపిన సిరంజీతో మహిళలపై దాడి చేసిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష

వీర్యం నింపిన సిరంజీతో మహిళను పొడిచినందుకు అమెరికాలోని మేరీల్యాండ్‌లో వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ మేరకు ఒహాయోకు చెందిన థామస్‌ స్టీమెన్‌కు తొలుత 25 ఏళ్ల జైలు శిక్ష పడింది.

Man Attack : వీర్యం నింపిన సిరంజీతో మహిళలపై దాడి చేసిన వ్యక్తికి పదేళ్లు జైలు శిక్ష

syringe semen

man attack with a syringe semen : అమెరికాలో ఓ వ్యక్తి పాడు బుద్ధికి తగిన శాస్తి అయింది. వీర్యం నింపిన సిరంజీతో ఓ మహిళను పొడిచినందుకు వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ ఘటన మేరీల్యాండ్‌లో చోటు చేసుకుంది. ఈ మేరకు ఒహాయోకు చెందిన థామస్‌ స్టీమెన్‌కు తొలుత 25 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు తర్వాత పదేళ్లకు కుదించింది.

2020 ఫిబ్రవరిలో కిరాణా దుకాణంలోకి వచ్చిన మహిళకు స్టీమెన్‌ (52) వెనక నుంచి సిరంజీని గుచ్చాడు. తొలుత ఏదో కుట్టిందని భావించిన మహిళ నిందితుడిని నిలదీసింది. సిగరెట్‌తో కాల్చావా అని అతన్ని ప్రశ్నించింది. దానికి అవునని చెబుతూనే.. అది పురుగు కుట్టినట్లు ఉంటుందని నిందితుడు మహిళతో అన్నాడని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు.

సిరంజీతో దాడి చేశాడని, అందులో వీర్యం కలిపాడని తర్వాత తేలింది. థామస్‌ స్టీమెన్‌ మరో ఇద్దరు బాధితులపైనా సిరంజీ దాడికి యత్నించాడు. తన ముందు నడవమని సూచిస్తూ 17 ఏళ్ల యువతిపై వీర్యం చల్లాడు.

బాధితుల ఫిర్యాదుతో పోలీసులు స్టీమెన్‌ ఇంటిని తనిఖీ చేశారు. ద్రవంతో కూడిన ఓ సిరంజీని పోలీసులు గుర్తించారు. తొమ్మిది ఖాళీ సిరంజీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా ఐదు సిరంజీలకు సూదులు లేకపోవడం గమనార్హం.