Woman Gave Birth: ఒకే కాన్పులో 9 మందికి జన్మనిచ్చిన మహిళ
మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు.

Woman Gave Birth
Woman Gave Birth: మహిళలు కవల పిల్లలకు జన్మనివ్వడం సాధారణ విషయమే, కొందరు మహిళలు ఒకే సారి ముగ్గురు లేదా నలుగురు పిల్లలకు జన్మనిస్తుంటారు. అయితే ఓ మహిళ ఒకే కాన్పులో తొమ్మిది మందికి జన్మనిచ్చింది. ఈ విషయం తెలిసిన వారు షాక్ అవుతున్నారు. పశ్చిమాఫ్రికాలోని మాలీ దేశానికి చెందిన హలీమా సిస్సే (25) గతేడాది ఆగస్టులో గర్భం దాల్చింది.
మూడు నెలల వరకు పొట్ట సాధారణంగానే ఉన్న.. మూడు నెలల తర్వాత సాధారణ గర్భవతులకంటే పొట్ట పెద్దగా కనిపించింది.. దీంతో వైద్యులను సంప్రదించారు. వైద్యులు స్కానింగ్ చేసి కడుపులో ఏడుగురు పిల్లలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను మాలీలోని మోరాకోకు తరలించారు. నెలలు నిండటంతో మంగళవారం ఆమెకు సర్జరీ చేశారు..
డాక్టర్లు ఏడుగురు పిల్లలే జన్మిస్తారు అనుకున్నారు. కానీ అదనంగా మరో ఇద్దరు పిల్లలు పుట్టేసరికి వైద్యులు షాక్ అయ్యారు. 9 మందిలో ఐదుగురు ఆడపిల్లలు కాగా, నలుగురు మగపిల్లలు.పిల్లలో నలుగురు బలహీనంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తల్లి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.