Young Man : యువతి గెటప్ లో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు..

గర్ల్ ఫ్రెండ్ కోసం యువతి గెటప్ లో పరీక్ష రాస్తూ ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఆఫ్రికాలోని చోటు చేసుకుంది.

Young Man : యువతి గెటప్ లో పరీక్ష రాస్తూ దొరికిపోయాడు..

Young

Africa Young Man : గర్ల్ ఫ్రెండ్ కోసం యువతి గెటప్ లో పరీక్ష రాస్తూ ఓ యువకుడు అడ్డంగా బుక్కయ్యాడు. ఈ ఘటన ఆఫ్రికాలోని చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…సెనెగ‌ల్‌లో హైస్కూల్ గ్రాడ్యుయేష‌న్ ప‌రీక్ష‌లో ఇంగ్లీష్ స‌బ్జెక్ట్‌లో ఫెయిల‌వుతాన‌ని భ‌య‌ప‌డుతున్న గ‌ర్ల్‌ఫ్రెండ్ గంగూ డియోం (19) కోసం తానే ఆ ప‌రీక్ష రాయాల‌ని ప్రియుడు ఖాదిం బూప్ (22) భావించాడు.

అయితే డియోంలా క‌నిపించ‌క‌పోయినా విగ్గుతో పాటు డ్రెస్‌, బ్రా, చెవిదిద్దులు ధ‌రించి గ‌ర్ల్‌ఫ్రెండ్ మాదిరిగా మేక‌ప్ చేసుకుని యువ‌తి గెట‌ప్‌లో ప‌రీక్షా కేంద్రానికి వెళ్లాడు.

ఆమె స్థానంలో మూడు రోజుల పాటు ఇంగ్లీష్ ప‌రీక్ష రాశాడు. నాలుగో రోజు అతడి తీరుపై అనుమానం వ‌చ్చిన ఇన్వెస్టిగేట‌ర్ గ‌మ‌నించ‌డంతో దొరికిపోయాడు. పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వడంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు బూప్‌ను అరెస్ట్ చేసి, దర్యాప్తు చేపట్టారు.

ఇంగ్లీష్‌లో త‌న గ‌ర్ల్‌ఫ్రెండ్ ఇబ్బందులు ఎదుర్కొంటుండ‌టంతో ఆమెకు సాయప‌డేందుకే తాను ఈ సాహ‌సం చేశాన‌ని నిందితుడు అంగీక‌రించాడు. మోసం, ఫోర్జ‌రీ ఆరోప‌ణ‌ల‌పై ప్రేమ జంట‌పై కేసు న‌మోదు చేశారు. నేరం రుజువైతే వీరికి జ‌రిమానా విధించ‌డంతో పాటు ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవ‌కాశమున్నట్లు తెలుస్తోంది.