Moon Soil Plant: చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం విజయవంతం

చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలు పెంపకం చేసి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరికకు ఇది అదిపెద్ద ముందడుగుగా చెప్పవచ్చు

Moon Soil Plant: చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కల పెంపకం విజయవంతం

Mon

Moon Soil Plant: భూమి మినహా మిగతా ఏ గ్రహంలోనూ లేని లక్షణం ‘ప్రకృతి’. పచ్చని చెట్లు, నీరు, జీవం వంటి సహజగుణాలు కేవలం భూమిపై మాత్రమే ఉన్నాయి. అయితే భవిష్యత్తులో భూమి కాకుండా చంద్రుడిపైనా చెట్లను చూడగలమా? అంటే అవుననే సమాధానం ఇస్తున్నాయి శాస్త్రవేత్తల పరిశోధనలు. చంద్రుడిపై నుంచి తెచ్చిన మట్టిలో మొక్కలు పెంపకం చేసి విజయం సాధించారు శాస్త్రవేత్తలు. భూమి ఆవల ఇతర గ్రహాలపై నివాసం ఏర్పరుచుకోవాలన్న మానవుడి కోరికకు ఇది అదిపెద్ద ముందడుగుగా చెప్పవచ్చు. చంద్రుడి ఉపరితలంపై ఉండే మట్టిని ‘రెగోళిత్’గా నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. అమెరికా ప్రయోగించిన అపోలో మిషన్ లో భాగంగా చంద్రుడిపైకి అడుగుపెట్టిన అప్పటి శాస్త్రవేత్తలు ఈ ‘రెగోళిత్’ను భూమికి తీసుకువచ్చారు. దాదాపు అర్ధ శతాబ్దం పాటుగా ‘రెగోళిత్’ సారంపై పరీక్షలు జరిపిన శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారిగా, పోషకాలు లేని చంద్ర రెగోలిత్‌లో పరిశోధకులు ఎంతో కష్టంతో కూడిన అధ్యయనం చేసి ‘అరబిడోప్సిస్ థాలియానా’ అనే మొక్కను పెంచారు.

read Other:Amarnath Yatra: జూన్ 30 నుంచి అమర్‌నాథ్ యాత్ర.. డ్రోన్లతో నిఘా

ఈ పరిశోధన NASA యొక్క దీర్ఘకాలిక గ్రహాంతర అన్వేషణ లక్ష్యాలకు కీలకంగా మారనుంది. ఎందుకంటే భవిష్యత్తులో అంతరిక్షంలో నివసించే వారికోసం లేదా విశ్వంలో పనిచేసే వ్యోమగాములు కోసం ఆహార వనరులను అభివృద్ధి చేయడానికి ఈరకంగా ఇతర గ్రహాలపై ఉన్న వనరులను ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. “వ్యవసాయ ఆవిష్కరణలను అభివృద్ధి చేయడానికి నాసా ఎలా పనిచేస్తుందో కూడా ఈ ప్రాథమిక మొక్కల పెరుగుదల పరిశోధన ఒక ముఖ్య ఉదాహరణగా చెప్పుకోవచ్చని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమిపై ఆహార కొరత ఉన్న ప్రాంతాల్లో మొక్కలు ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడంలో విశ్లేషించుకోవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

Read Others:Meditation : మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ధ్యానమే మార్గమా!

భూసారం వలే కాకుండా..చంద్రుడి రెగోలిత్(చంద్రుడిపై మట్టి)..అగ్నిపర్వత బూడిద కలిగి ఉంటుంది. అటువంటి నిస్సారవంతమైన మట్టిలో మొక్కలు పెరుగుతాయని శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోయారు. అయితే గత కొన్నేళ్లుగా జరిపిన పరీక్షల ఆధారంగా..ఒక నియంత్రిత వాతావరణంలో గాలి, వెలుతురూ, నీరుని నియంత్రిత పద్దతిలో అందించడం ద్వారా చంద్రుడి రెగోళిత్ పై మొక్కలు విజయవంతంగా పెంచగలిగినట్టు ఫ్లోరిడా విశ్వవిద్యాలయంలో హార్టికల్చరల్ సైన్సెస్ విభాగంలో ప్రొఫెసర్ రాబర్ట్ ఫెర్ల్ వివరించారు. రాబర్ట్ ఈ పరిశోధనలో ముఖ్య పాత్ర పోషించారు. చంద్రుడి మట్టిలో మొక్కల పెంపకంతో మున్ముందు అంతరిక్షంలోనే ఆహార పంటల సాగు జరిగే అవకాశం ఉంది.