TikTok Ban in Canada : చైనా యాప్‌కు మళ్లీ షాక్.. భారత్ తర్వాత కెనడాలో టిక్‌టాక్ బ్యాన్.. అసలు రీజన్ తెలిస్తే షాకవుతారు..!

TikTok Ban in Canada : చైనా యాజమాన్యంలోని సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ (TikTok) మళ్లీ బ్యాన్ అయింది. కానీ, ఈసారి కెనడాలో టిక్‌టాక్ యాప్ నిషేధానికి గురైంది.

TikTok Ban in Canada : చైనా యాప్‌కు మళ్లీ షాక్.. భారత్ తర్వాత కెనడాలో టిక్‌టాక్ బ్యాన్.. అసలు రీజన్ తెలిస్తే షాకవుతారు..!

After India, TikTok gets banned in this country over national security reasons

TikTok Ban in Canada : చైనా యాజమాన్యంలోని సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్ (TikTok) మళ్లీ బ్యాన్ అయింది. కానీ, ఈసారి కెనడాలో టిక్‌టాక్ యాప్ నిషేధానికి గురైంది. యూజర్ల ప్రైవసీ, జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా అక్కడి కెనడా ప్రభుత్వం టిక్ టాక్ యాప్ పై నిషేధాన్ని విధించింది. దేశంలో ప్రభుత్వానికి సంబంధించిన డివైజ్‌లలో టిక్‌టాక్‌ యాప్ వినియోగంపై కెనడా నిషేధాన్ని ప్రకటించింది. ఈ యాప్ యూజర్ల ప్రైవసీకి విరుద్ధంగా ఉన్నందుకుగానూ కెనడా ప్రభుత్వం నిషేధం విధించినట్టు ఓ నివేదిక తెలిపింది. TikTok యాప్ చైనీస్ కంపెనీకి చెందినది కావడంతో పాటు యూజర్ల డేటాకు చైనా ప్రభుత్వం యాక్సెస్ కలిగి ఉండవచ్చనే ఆందోళనల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపట్టింది.

కెనడియన్‌ల పర్సనల్ డేటా ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉంచడానికి కెనడియన్ ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే TikTok యాప్ బ్యాన్ చేసింది. కెనడియన్ల ఆన్‌లైన్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు అక్కడి ప్రభుత్వం చైనా యాప్‌పై నిషేధాన్ని అమల్లోకి తెచ్చినట్టు ఓ నివేదిక వెల్లడించింది. టిక్ టాక్ పై నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపింది.

Read Also : TikTok-BGMI To India : ఇండియాకు షార్ట్ వీడియో TikTok, BGMI గేమింగ్ యాప్ కమింగ్ బ్యాక్..? అసలు వాస్తవాలివే..!

ఇకపై భవిష్యత్తులో కెనడియన్ ప్రభుత్వ ఉద్యోగులు (Government Devices)  టిక్‌టాక్ యాప్‌ (TikTok App Download)ని డౌన్‌లోడ్ చేసుకోలేరు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను పర్యవేక్షిస్తున్న ట్రెజరీ బోర్డ్, టిక్‌టాక్ డేటా సేకరణ పద్ధతులు ఫోన్ కంటెంట్‌లకు గణనీయమైన యాక్సస్ అందిస్తుందని పేర్కొంది.

After India, TikTok gets banned in this country over national security reasons

After India, TikTok gets banned in this country over national security reasons

ఈ టిక్‌టాక్ యాప్ వినియోగం వల్ల కలిగే నష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, దేశ ప్రభుత్వ డేటాకు ముప్పు పొంచి ఉందని ఉద్దేశంతో ఎలాంటి ఆధారాలు లేకపోయినా టిక్ టాక్ బ్యాన్ చేయాల్సి వచ్చిందని ట్రెజరీ బోర్డు ప్రెసిడెంట్ మోనా ఫోర్టియర్ ఒక ప్రకటనలో తెలిపారు. వాస్తవానికి.. టిక్ టాక్ యాప్ ద్వారా ప్రభుత్వ డేటా యాక్సస్ పొందినట్టు బోర్డు వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. కానీ, ఈ TikToK అప్లికేషన్‌ను ఉపయోగించడం వల్ల కలిగే నష్టాలు స్పష్టంగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది.

ఈ నిషేధంతో కెనడియన్లు, వ్యాపారాలు, వ్యక్తుల సొంత డేటాతో పాటు కెనడియన్ ప్రభుత్వం, ఇతర పర్సనల్ డేటాను ప్రొటెక్ట్ చేయడంలో ముందుజాగ్రత్త చర్యగా మరో నివేదక పేర్కొంది. అలాగే, చైనా ప్రభుత్వం ద్వారా యూజర్ డేటాను దుర్వినియోగం చేసే అవకాశం ఉందనే ఆందోళనల నేపథ్యంలో కెనడా ప్రభుత్వం TikTokని నిషేధించాలని నిర్ణయం తీసుకుంది. ఈ చర్యతో టిక్‌టాక్, పేరంట్ కంపెనీ బైట్‌డాన్స్ లిమిటెడ్‌పై అంతర్జాతీయంగా మరింత ప్రభావం పడనుంది. భారత్, కెనడా తరహాలో టిక్ టాక్ బ్యాన్‌పై ఇతర దేశాలు కూడా అనుసరిస్తాయో లేదో చూడాలి.

Read Also : Next iPhone SE 4 Launch : భారీ OLED డిస్‌ప్లేతో ఐఫోన్ SE4 వస్తోంది.. ఇంటర్నల్ 5G మోడమ్, మరెన్నో ఆకర్షణీయమైన ఫీచర్లు..