Air Hostess : ఎయిర్‌ హోస్టెస్‌ల అర్ధనగ్న నిరసనలు

సమస్యలు పరిష్కరించాలని ఇటలీ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హోస్టెస్‌లు వినూత్న నిరసన చేపట్టారు. ఎయిర్ హోస్టెస్‌లు అర్ధనగ్న నిరసన చేపట్టారు.

Air Hostess : ఎయిర్‌ హోస్టెస్‌ల అర్ధనగ్న నిరసనలు

Airhostess

Air hostesses protest : కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు సమస్యలు పరిష్కారం కోసం పోరాడుతుంటారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ ధర్నాలు, ర్యాలీలు, రాస్తా రోకోలు చేస్తుంటారు. ఇలాగే సమస్యలు పరిష్కరించాలని ఇటలీ ఎయిర్‌లైన్స్‌ ఎయిర్‌ హోస్టెస్‌లు వినూత్న నిరసన చేపట్టారు. ఎయిర్ హోస్టెస్‌లు అర్ధనగ్న నిరసన చేపట్టారు. కాంపిడోగ్లియోలో 50 మంది ఎయిర్ హోస్టెస్‌లు రోడ్డు మీద బట్టలు విప్పి నిరసన చేపట్టారు. త‌మ‌కు వ‌చ్చే జీతంలో కోత‌లు, ఉద్యోగాల నష్టంపై మనస్తాపంతో నిరసన చేపట్టామని తెలిపారు.

ఇట‌లీలో ఐటీఏ ఎయిర్‌వేస్‌ను అలాటియా ఎయిర్‌లైన్స్ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో అలిటాలియా ఎయిర్‌లైన్స్‌లో పని చేస్తున్న ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడింది. అలిటాలియా ఎయిర్‌లైన్స్ సుమారుగా 10,500 మంది ఉద్యోగులను నియమించింది. కానీ, ఐటీఏ ఎయిర్‌వేస్‌లో కేవలం 2,600 మంది మాత్ర‌మే ఉద్యోగాలు పొందగలిగారని స‌మాచారం. మరోవైపు ఐటీఏ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ ఉద్యోగి.. సీనియారిటీ ప్రకారం రావాల్సిన ఉద్యోగాలు తమకు ద‌క్క‌లేదని, సాల‌రీలు కూడా చాలా తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియని పరిస్థితి నెల‌కొందని వాపోయారు.

Pegasus : పెగాసస్ అంశంపై సుప్రీం కీలక తీర్పు

దీంతో ఇట‌లీలో అలిటాలియా ఎయిర్ లైన్స్‌కు చెందిన 50 మంది ఎయిర్ హోస్ట్‌లు అర్ధ‌న‌గ్నంగా నిర‌స‌న చేప‌ట్టారు. రోమ్ న‌గ‌రంలోని టౌన్ హాల్ ముందు త‌మ యూనిఫాంలు విప్పి ఆందోళ‌న చేపట్టారు. జీతంలో కోత‌లు, ఉద్యోగాలు తొల‌గించ‌డంపై మ‌న‌స్తాపం చెందిన‌ట్లు ఉద్యోగులు అంటున్నారు. చాలా మంది ఉద్యోగుల‌ను ప‌క్క‌కు పెట్టడంతో ఏటీఏపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ నిర‌స‌నకు దిగారు. ఐటిఏ ఎయిర్‌వేస్ ప్రెసిడెంట్ ఆల్ఫ్రెడో అల్టావిల్లా స్పందిస్తూ ఉద్యోగులందరూ కంపెనీ నిబంధనలను అనుసరించి ఒప్పందంపై సంతకం చేశారని పేర్కొన్నారు. ఉద్యోగులు సమ్మె చేస్తారని తాను భావింలేదని చెప్పారు. అలా చేస్తే వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.