Alligator : డ్రోన్ తినేసిన మొసలి.. నోట్లో నుంచి పొగలు.. వీడియో షేర్ చేసిన గూగుల్ సీఈఓ

డ్రోన్ తినేసిన మొసలి నోట్లో నుంచి పొగలు కక్కుతోంది.. ఈ వీడియోను గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Alligator : డ్రోన్ తినేసిన మొసలి.. నోట్లో నుంచి పొగలు.. వీడియో షేర్ చేసిన గూగుల్ సీఈఓ

Alligator Eats Drone In Video Shared By Sundar Pichai

Alligator Eats Drone In Video By Sundar Pichai : డ్రోన్ తినేసిన మొసలి నోట్లో నుంచి పొగలు కక్కుతోంది.. ఈ వీడియోను గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది. మొసలికి దగ్గరగా తక్కువ ఎత్తులో ఎగురుతున్న డ్రోన్‌ను అలిగేటర్ అమాంతం ఒడిచిపట్టింది. నమిలి మింగేస్తుండగా.. మొసలి నోట్లో నుంచి పొగలు కక్కడాన్ని వీడియోలో చూడొచ్చు. గూగుల్ ద్వారా బ్లాగ్ పోస్ట్‌లను షేర్ చేయడం.. కంపెనీ తాజా ప్రొడక్టుల గురించి అప్‌డేట్‌లు, పండుగలకు శుభాకాంక్షలు తెలుపుతుంటారు సుందర్ పిచాయ్.. ట్విటర్ లో యాక్టివ్ గా ఉంటూ తనకు కనిపించిన ఏదైనా ఆసక్తికరమైన స్టోరీలను వెంటనే రీట్వీట్ చేస్తుంటారు.


పిచాయ్ రీట్వీట్ చేసిన వీడియోను ఫ్లోరిడాలో రికార్డు చేశారు. కాలిఫోర్నియాకు చెందిన డ్రోన్ కంపెనీ 3DR వ్యవస్థాపకుడు మాజీ సీఈఓ క్రిస్ ఆండర్సన్ ఈ ఫుటేజీని ముందుగా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆ తర్వాత పిచాయ్ తన ట్విట్టర్ అకౌంట్లో ఈ వీడియోను రీట్వీట్ చేశారు. డ్రోన్ సాయంతో అలిగేటర్ ను దగ్గర నుంచి షాట్ తీసేందుకు ప్రయత్నించిన సమయంలో అది తన దవడలతో గట్టిగా పట్టేసుకుంది. డ్రోన్ ను గట్టిగా కొరికివేయడంతో అందులో నుంచి పొగలు వచ్చాయి.
Sonia Aggarwal : ‘7/G బృందావన కాలని’ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో చూశారా..


మొసలి నోరు తెరిచిందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని డ్రోన్ ఆపరేటర్ పోస్టులో రాశారు. సుందర్ పిచాయ్ తన పోస్ట్‌కి కామెంట్లు ఏమి లేకుండా రీట్వీట్ చేసారు. ఈ వీడియో చాలా మంది ట్విట్టర్ యూజర్లు మండిపడ్డారు. జంతువుల విషయంలో డ్రోన్ల వాడకాన్ని కఠినంగా నియంత్రించాలని కోరారు. మరో ట్విట్టర్ యూజర్.. ఈ చర్యను క్రూరమైనదని.. విచారకరమైనదిగా పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలకు పాల్పడేవారికి జరిమానా విధించాలని మరో యూజర్ మండిపడ్డారు. సుందర్ పిచాయ్ క్లిప్‌ను రీట్వీట్ చేయడంతో సంతోషించానని మరో యూజర్ చెప్పాడు.

Chicken : కాకపుట్టిస్తున్న నాటుకోడి ధర