అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ బయటకు తెలియని విషయాలు

అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ బయటకు తెలియని విషయాలు

Amazon CEO Jeff Bezos: ప్రస్తుత ఏడాది మూడో క్వార్టర్ లో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ పదవి నుంచి దిగిపోనున్నారు. అతని స్థానంలోకి అమెజాన్ క్లౌడ్ డివిజన్ కు చెందిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఆండీ జాస్సీ రానున్నారు. అమెజాన్ సీఈఓగా, వ్యవస్థాపకుడుగా మాత్రమే తెలిసిన జెఫ్ బెజోస్ గురించి మీకు తెలియని అరుదైన విషయాలు ఇలా..

1. 2010లో దాదాపు అమెజాన్ ఈమెయిల్ మార్కెటింగ్ దాదాపు క్లోజ్ అయిపోయింది. అమెజాన్ వెబ్ సైట్ లో చూసినవే పదేపదే వస్తుండటంతో విసిగిపోయారు.

2. ఆ సమయంలో అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ కస్టమర్ సర్వీస్ ను సీరియస్ గా తీసుకున్నారు. కస్టమర్లను డైరక్ట్ గా ఈమెయిల్ చేయమని వాటికి రెస్పాన్స్ ఇచ్చేవారు. నిజంగా సమస్య ఉంటే దానిని అమెజాన్ ఎంప్లాయ్ కి పంపించి ప్రాబ్లమ్ ఫిక్స్ చేయాలని చెప్పేవారు. అందుకే అది ఆ స్థానంలో నిల్చొంది.

3. బెజోస్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను నిషేదించారు. అంతేకాకుండా స్టాఫ్ ను 6పేజీల ప్రపోజల్ పేపర్లు రెడీ చేయమనేవారు. ఇలా చేయడం వల్ల క్రిటికల్ థింకింగ్ తో పాటు బుల్లెట్ పాయింట్లు కూడా క్లియర్ గా ఉండేవి. ఇదే ఇప్పటికి కూడా అమెజాన్ కు ఉపయోగపడుతుంది.

4. జెఫ్ అతని హై స్కూల్ లైఫ్ లోనే ఓ స్పీచ్ లో పాల్గొని తన కలేంటో చెప్పాడు. ‘మానవత్వాన్ని కాపాడాలని దాని కోసం ఆర్బిటింగ్ స్పేస్ నిర్మించాలనుకుంటున్నట్లు.. అలా గ్రహం దాని ప్రకృతిని కాపాడతానని’ చెప్పారు. అదే ఉద్దేశ్యంతో బ్లూ ఆరిజన్ అనే ప్రైవేట్ రాకెట్ షిప్ కంపెనీని పరిచయం చేశారు. అమెజాన్ సీఈఓ పదవికి రాజీనామా చేసిన తర్వాత అక్కడే ఎక్కువ కాలం గడపనున్నారు.

5. చిన్నతనంలో.. అంటే మూడేళ్ల వయస్సులో నిజమైన మంచం మీద పడుకోవాలని స్క్రూ డ్రైవర్ తో ఊయలను విరగ్గొట్టేశాడు.