Caste Discrimination : కుల వివక్ష నిరోధక బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం

కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని దానిని రూపు మాపాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ ఐషా వాహబ్ ఎస్ బీ 403 బిల్లును రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్ లో సెనెట్ లో ప్రవేశపెట్టారు.

Caste Discrimination : కుల వివక్ష నిరోధక బిల్లుకు కాలిఫోర్నియా సెనేట్ ఆమోదం

Caste Discrimination

Updated On : May 12, 2023 / 11:48 AM IST

Caste Discrimination : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ లో కుల వివక్ష నిరోధక బిల్లుకు ఆమోదం లభించింది. కుల వివక్ష నిరోధక బిల్లుకు కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ ఆమోదం తెలిపింది. గురువారం సెనెట్ లో ప్రవేశపెట్టిన కుల వివక్ష నిరోధక బిల్లుకు ఆమోదం తెలిపారు. సెనెట్ లో మొత్తం 40 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లుపై సెనెట్ లో నిర్వహించిన ఓటింగ్ లో 35 పాల్గొన్నారు.

వీరిలో 34 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, ఒకరు మాత్రం దానిని వ్యతిరేకిస్తూ ఓటు వేశారు. మెజారిటీ సభ్యులు ఆమోదం తెలపడంతో బిల్లు పాస్ అయినట్లు స్పీకర్ ప్రకటించారు. త్వరలో ఈ బిల్లును హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కు పంపిస్తామని అక్కడ బిబ్లు పాస్ అయ్యాక గవర్నర్ ఆమోదం కోసం పంపిస్తామని పేర్కొన్నారు. గవర్నర్ సంతకం చేశాక ఈ ఎస్ బీ 403 బిల్లు చట్టంగా మారుతుందని వెల్లడించారు.

Seattle Bans caste discrimination : కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన అమెరికాలోని తొలి నగరం

కాలిఫోర్నియా రాష్ట్రంలో కుల వివక్ష కొనసాగుతోందని దానిని రూపు మాపాలని డెమొక్రటిక్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యులు, సెనేటర్ ఐషా వాహబ్ ఎస్ బీ 403 బిల్లును రూపొందించి ఈ ఏడాది ఏప్రిల్ లో సెనెట్ లో ప్రవేశపెట్టారు. కులం కారణంగా వివక్ష చూపడం, హింసకు పాల్పడటం చట్ట విరుద్ధంగా మార్చాలని వారు డిమాండ్ చేశారు.

రాష్ట్రంలోని అన్ని చోట్ల అందరికీ సమాన అవకాశాలు, సదుపాయాలు, సేవలు అందాలని
ఐషా వాహబ్ పేర్కొన్నారు. అందులో భాగంగా కుల వివక్షను ఎదుర్కొంటున్న వారికి రక్షణ కల్పించేందుకు అవసరమైన విధి విధానాలతో ఎస్ బీ 403 బిల్లును సెనేట్ లో ప్రవేశపెట్టారు.
ఈ బిల్లుకు సెనేట్ ఆమోదం తెలిపింది.

Dalit IIT Student: ఐఐటీ బాంబేలో మరో రోహిత్ వేముల.. కుల వివక్ష దాడి భరించలేక విద్యార్థి ఆత్మహత్య

బిల్లుకు సెనేట్ ఆమోదం లంభించడంపై ఐషా వాహబ్ సంతోషం వ్యక్తం చేశారు.సెనేట్ ఆమోదం తెలపడంతో ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలకు నిలయమైన కాలిఫర్నియా కుల వివక్షను నిషేధించిన మొదటి అమెరికా రాష్ట్రంగా అవతరించింది. కాగా, ఇటీవలే సీటెల్ కుల వివక్షను నిషేధించిన మొదటి నగరంగా నిలిచింది.