Seattle Bans caste discrimination : కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన అమెరికాలోని తొలి నగరం

అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా నిలిచింది సియాటెల్‌.సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుంది అని కౌన్సిల్‌ వెల్లడించింది.

Seattle Bans caste discrimination : కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం చేసిన అమెరికాలోని తొలి నగరం

Seattle Bans caste discrimination

Seattle Bans caste discrimination : అభివృద్ధి చెందిన దేశం అని పేరు. ప్రపంచ దేశాలకే ‘పెద్దన్న’గా ఖ్యాతి. అయినా అమెరికాలో కుల వివక్ష, జాతి వివక్ష, వర్ణ వివక్ష రాజ్యమేలుతుంటాయి. కులాల కుమ్ములాటలు భారత్ లోనే కాదు అమెరికాలో కూడా ఉంటాయనేది నమ్మితీరాల్సిన విషయం. ఈ వివక్ష ఎంతగా ఉంటే దీనికి వ్యతిరేకంగా అమెరికాలోని ఓ నగరం కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలనుంటుంది? కుల వివక్షకు వ్యతిరేకంగా చట్టం తీసుకొచ్చింది అమెరికాలోని ‘సియోటెల్’నగరం..

అమెరికాలో వర్ణ వివక్షకు ఎంతమంది ప్రాణాలు పోయాయో లెక్కేలేదు. వర్ణ వివక్ష అంటే మనకు ఠక్కున గుర్తుకొచ్చేది ‘జార్జ్ ప్లాయిడ్’..అత్యంత క్రూరమైన హత్య..వర్ణ వివక్ష వైరస్ కంటే ప్రమాదం అనేలా జరిగిన అత్యంత క్రూరమైన హత్య ‘జార్జ్ ప్లాయిడ్’పై జరిగిన దాడి..ఆ దాడి యావత్ అమెరికాన కదిపేసింది…ప్రపంచ దేశాలన్ని విమర్శలు చేసే స్థాయికి చేరింది.

అటువంటి అమెరికాలో వర్ణ వివక్షే కాదు కుల వివక్ష కూడా ఉందని దానికి వ్యతిరేకంగా చట్టం తీసుకురావాల్సినఅవసరం ఉందని భావించింది ‘సియోటెల్’ నగరం పాలక వర్గం..అమెరికాలో అమలవుతున్న ‘వివక్ష వ్యతిరేక చట్టంలో’ కులాన్ని కూడా చేర్చిన మొదటి నగరంగా సియాటెల్‌ నిలిచింది. దీనికి సంబంధించి స్థానిక సభలో ప్రవాస భారతీయురాలు, సియాటెల్‌ నగర కౌన్సిల్‌ సభ్యురాలు క్షమా సావంత్‌ మంగళవారం (ఫిబ్రవరి 21,2023) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

జాత్యహంకారం కంటే కుల వివక్ష భిన్నంగా లేదని అందువల్ల దీనిని కూడా చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరారు. సియాటెల్‌ సిటీ కౌన్సిల్‌ 6-1 ఓట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించింది. దీంతో అమెరికాలోని ప్రవాస భారతీయుల్లోని కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని కౌన్సిల్‌ వెల్లడించింది. ఈ సందర్భంగా.. సీటెల్ సిటీ కౌన్సిల్‌లో సభ్యులు క్షమా సావంత్‌ మాట్లాడుతూ ఈ స్ఫూర్తి దేశమంతా విస్తరించేలా కృషి చేయాలన్నారు.

“కుల వివక్ష ఇతర దేశాలలో మాత్రమే కాదు..దీనిని దక్షిణాసియా అమెరికన్లు, ఇతర వలస శ్రామిక ప్రజలు తమ కార్యాలయాల్లో, టెక్ సెక్టార్‌తో సహా, సీటెల్‌లో మరియు దేశంలోని నగరాల్లో ఎదుర్కొంటున్నారని తెలిపారు. అందుకే మా దక్షిణాసియా, ఇతర వలస సంఘం సభ్యులు మరియు శ్రామిక ప్రజలందరికీ సంఘీభావంగా కుల ఆధారిత వివక్షను నిషేధించడానికి మా నగరం కోసం దేశంలోనే మొదటి చట్టాన్ని తీసుకురావడానికి నా కార్యాలయం గర్విస్తోంది అని అన్నారు.

ఈ చట్టం హోటళ్లు, ప్రజా రవాణా, పబ్లిక్ రెస్ట్‌రూమ్‌లు,రిటైల్ మార్కెట్స్ వంటి పబ్లిక్ వసతి స్థలాలలో కులం ఆధారంగా వివక్షను నిషేధిస్తుందని… అద్దె గృహాల లీజులు, ఆస్తి విక్రయాలు, తనఖా రుణాలు చట్టం పరిధిలోకి వస్తాయని తెలిపారు.