US Forces : 20 ఏళ్ల యుద్ధం ముగిసింది.. ఆఫ్ఘాన్‌ నుంచి వెనుదిరిగిన అమెరికా బలగాలు

ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. 2001 సెప్టెంబర్ 9 న న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఆల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలతో బాంబుదాడి చేశారు.

US Forces : 20 ఏళ్ల యుద్ధం ముగిసింది.. ఆఫ్ఘాన్‌ నుంచి వెనుదిరిగిన అమెరికా బలగాలు

Us Forces

US Forces : ఆల్ ఖైదా ఉగ్రవాద సంస్థను సమూలంగా అంతం చేయడమే లక్ష్యంగా అమెరికా, నాటో బలగాలు ఆఫ్ఘనిస్థాన్‌లో జరిపిన రెండు దశాబ్దాల యుద్ధం దాదాపు ముగిసింది. 2001 సెప్టెంబర్ 11 న న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై ఆల్ ఖైదా ఉగ్రవాదులు విమానాలతో బాంబుదాడి చేశారు. ఈ దాడిలో 2,996 మంది మృతి చెందారు. వేల సంఖ్యలో గాయపడ్డారు.

ఈ దాడి చేసిన ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాను సమూలంగా అంతం చెయ్యాలనే ఉద్దేశంతో 20 ఏళ్ల క్రితం ఆఫ్ఘనిస్థాన్‌లో అడుగుపెట్టాయి అమెరికా దళాలు. ఈ 20 ఏళ్ల యుద్ధంలో ఆల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ తోపాటు.. అనేకమంది ఉగ్రవాదులను హతం చేశాయి. సుదీర్ఘ పోరాటం అనంతరం అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్థాన్‌ నుంచి వెనుదిరిగాయి.

ఎయిర్‌బేస్‌ను ఖాళీ చేసిన అమెరికా మిలటరీ దానిని ఆఫ్ఘనిస్థాన్ నేషనల్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్‌కు అప్పగించినట్టు ఆఫ్ఘాన్‌ అధికారులు తెలిపారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో బాగ్రామ్ ఎయిర్‌బేస్‌ను ప్రభుత్వానికి అధికారికంగా అప్పగించనున్నట్టు ఆఫ్ఘాన్ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 2,500-3,500 మంది అమెరికా బలగాలు శనివారం ఆఫ్ఘాన్‌ను విడిచిపెట్టనున్నాయి.