Apple Employees: బూస్టింగ్ డోస్ తీసుకుంటేనే యాపిల్ ఉద్యోగులకు ఎంట్రీ

యాపిల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కొవిడ్ బూస్టర్ డోస్ తప్పనిసరి చేసింది ఆ సంస్థ. వ్యాక్సినేషన్ వేసుకుని వారికి నో ఎంట్రీ చెప్తూ.. ఆఫీసులకు రావాలనుకుంటే తప్పనిసరిగా బూస్టర్ డోస్...

Apple Employees: బూస్టింగ్ డోస్ తీసుకుంటేనే యాపిల్ ఉద్యోగులకు ఎంట్రీ

Covid Booster Dose

Apple Employees: యాపిల్ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు కొవిడ్ బూస్టర్ డోస్ తప్పనిసరి చేసింది ఆ సంస్థ. వ్యాక్సినేషన్ వేసుకుని వారికి నో ఎంట్రీ చెప్తూ.. ఆఫీసులకు రావాలనుకుంటే తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకున్న ప్రూఫ్ తీసుకుని రావాలని ఆదేశించింది.

‘కొవిడ్-19 వ్యాక్సిన్ ప్రాథమిక సామర్థ్యంతో పాటు ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకోవాలంటే బూస్టర్ షాట్ తీసుకోవాలి. అటువంటి వ్యాక్సిన్ సమర్థతతో పలు తీవ్రమైన జబ్బుల నుంచి రక్షణ లభిస్తుంది’ అని ప్రకటనలో తెలిపింది యాపిల్ సంస్థ.

అమెరికాలోని చాలా సంస్థలు కొవిడ్-19 రూల్స్ పాటిస్తూ.. వ్యాక్సినేషన్ తప్పనిసరి చేశాయి. తిరిగి ఆఫీసులకు రమ్మని చెప్పినప్పటికీ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా దేశ వ్యాప్తంగా ఇన్ఫెక్షన్లు వ్యాప్తి పెరుగుతున్న క్రమంలో నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది.

ఇది కూడా చదవండి: సుమ ర్యాప్ పాడితే అదిరిపోద్దంతే..

జనవరి రెండో వారంలో ఫేస్ బుక్ పేరెంట్ సంస్థ అయిన మెటా.. కొవిడ్ బూస్టర్ షాట్స్ తీసుకున్న వారినే ఆఫీసులకు రావాలని చెప్పింది. అయితే వారు కూడా నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటూ.. జనవరి 31 నుంచి మార్చి 28కి ఆఫీసుల ఓపెనింగ్స్ వాయిదా వేశారు.