Jayamma Panchayathi : సుమ ర్యాప్ పాడితే అదిరిపోద్దంతే..

సుమ ప్రధాన పాత్రలో నటిస్తున్న‘జయమ్మ పంచాయితీ’ లోని సెకండ్ సాంగ్ రాజమౌళి రిలీజ్ చేశారు..

Jayamma Panchayathi : సుమ ర్యాప్ పాడితే అదిరిపోద్దంతే..

Jayamma Panchayathi

Updated On : January 16, 2022 / 3:18 PM IST

Jayamma Panchayathi: టెలివిజన్ స్టార్ యాంకర్ సుమ.. 1996లో దర్శకరత్న దాసరి నారాయణ రావు డైరెక్ట్ చేసిన ‘కళ్యాణ ప్రాప్తిరస్తు’ సినిమాతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. తర్వాత బుల్లితెర సూపర్ స్టార్ అయిపోయారు. పాతికేళ్ల తర్వాత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారామె.

Bhama Kalapam : ‘ఆహా’ లో మరో అదిరిపోయే థ్రిల్లర్..

సుమ ప్రధాన పాత్రలో.. వెన్నెల క్రియేషన్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా తెరకెక్కుతున్న సినిమా ‘జయమ్మ పంచాయితీ’. విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు.. ఇటీవల మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. క్యారెక్టర్లను రివీల్ చేస్తూ రూపొందించిన వీడియోకు మంచి స్పందన వచ్చింది.

‘తిప్పగలనా చూపు తిప్పగలనా’ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ నేచురల్ స్టార్ నాని విడుదల చేశారు. ఇప్పుడు సెకండ్ సాంగ్‌ని దర్శకధీరుడు రాజమౌళి రిలీజ్ చేశారు. స్వరవాణి కీరవాణి ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. జయమ్మ క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసేలా రామజోగయ్య శాస్త్రి చక్కటి లిరిక్స్ రాశారు.. శ్రీ కృష్ణ చాలా చక్కగా పాడారు.. సుమ ర్యాప్ పాడడం విశేషం..