AR Rahman Daughter: ఏఆర్ రెహమాన్ కూతురి స్వరానికి ముగ్ధులవుతున్న దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రేక్షకులు

ఆస్కార్ విన్నర్.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ రీసెంట్ పర్‌ఫార్మెన్స్ అద్భుతాలు సృష్టించింది. దుబాయ్ ఎక్స్‌పో 2020 వేదికగా...

AR Rahman Daughter: ఏఆర్ రెహమాన్ కూతురి స్వరానికి ముగ్ధులవుతున్న దుబాయ్ ఎక్స్‌పో 2020 ప్రేక్షకులు

Ar Rehman Daughter

AR Rahman Daughter: ఆస్కార్ విన్నర్.. మ్యూజిక్ మ్యాస్ట్రో ఏఆర్ రెహమాన్ కూతురు ఖతీజా రెహమాన్ రీసెంట్ పర్‌ఫార్మెన్స్ అద్భుతాలు సృష్టించింది. దుబాయ్ ఎక్స్‌పో 2020 వేదికగా 24 సింగర్.. 16ఏళ్ల పియానిస్ట్ తో కలిసి ‘ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా’లో భాగంగా వరల్డ్ చిల్ట్రన్స్ డే సందర్భంగా ఈవెంట్ చేశారు.

ఆమె తండ్రి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఫరిష్టోన్ సాంగ్ కు పాడి అందరి హృదయాలను గెలుచుకుంది. ఈ వీడియోను యూట్యూబ్ ఛానెల్ లో షేర్ చేసిన రెహమాన్ ఇలా రాశారు. ‘ఆ ఈవెంట్ లో చూడటం మిస్ అయిన వారి కోసం వీడియో ఇక్కడ ఉంచాం. ఫిర్దౌస్ ఆర్కెస్ట్రాకు చాలా పెద్ద థ్యాంక్స్. ఎక్స్‌పో 2020 దుబాయ్ షో అత్యద్భుతంగా జరిగింది’

మెలోడియస్ వాయీస్ నెటిజన్లను మరో లోకానికి చేర్చడం ఖాయం. కామెంట్ సెక్షన్ లోనూ ఇదే వినిపిస్తుంది. రెహమాన్ సార్ కంపోజ్ చేసిన అద్భుతాన్ని ఖతీజా గొంతులో నుంచి జాలువారింది. మరొకరు రాస్తూ.. బ్రిలియంట్, ప్రాణం పెట్టి చేసిన కంపోజిషన్ ఇది. మరపురాని స్వరం ఇదంటూ కామెంట్లు వస్తున్నాయి.

………………………………. : గౌతం గంభీర్‌ను చంపుతామంటూ బెదిరింపులు