అబార్షన్లను చట్టబద్ధం చేసిన అర్జెంటీనా..లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో..మొదటి చారిత్రాత్మక నిర్ణయం

అబార్షన్లను చట్టబద్ధం చేసిన అర్జెంటీనా..లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో..మొదటి చారిత్రాత్మక నిర్ణయం

Argentina legalizes abortion : అబర్షన్స్ విషయంలో అర్జెంటీనా ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

 

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కొంతమంది హర్షం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా తీసుకున్న సంచలన నిర్ణయంపై బ్యూనస్‌ ఏర్స్‌లో ఉన్న సెనేట్‌ భవనం ముందు వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. కానీ కొంతమంది మాత్రం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు కూడా చేశారు.

కాగా..2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పలు యత్నాలు చేసింది. ఎలాగైనా అబార్షన్లను చట్టబద్దం చేయాలని విఫలయత్నం జరిగింది. కానీ సాధ్యం కాలేదు. ఈనాడు ప్రవేశపెట్టిన అబార్షన్ల చట్ట బద్దత బిల్లును దిగువసభ ఆమోదించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో సెనేట్‌లో వీగిపోయింది. ఈనాడు పాలకపక్షం అనుమతితో ఈ బిల్లు ఆమోదం పొందింది. దీంతో అబార్షన్లకు చట్టబద్దత ఏర్పడింది.

కాగా.. సుమారు నాలుగున్నర కోట్ల మంది జనాభా (2010 జనాభా లెక్కల ప్రకారం 40,091,359 మంది) గల అర్జెంటీనాలో ప్రతి సంవత్సరం వేలాది అబార్షన్లు చట్టవిరుద్ధంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అబార్షన్లు చేయించుకోవటానికి అనుమతించవద్దని..అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ…నిరసనలు వెల్లువెత్తుతునే ఉన్నాయి.కానీ అబార్షన్లు మాత్రం జరుగుతునే ఉన్నాయి.

అబార్షన్ల చేయించుకుంటే శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ కేథలిక్ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్‌ 38-29 ఓట్ల తేడాతో ఈ చట్టాన్ని ఆమోదించింది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశంగా అర్జెంటీనా పేరు తెచ్చుకుంది. కాగా ఈ అబార్షన్ల చట్టంతో మొదటి 14వారాలలో మాత్రమే గర్భస్రావం చేయించుకోవటానికి అనుమతులు ఉండనున్నాయి.