Ross 508b Super Earth : అచ్చం భూమిలా ఉండే ‘సూపర్ ఎర్త్’ ను గుర్తించిన శాస్త్రవేత్తలు

మన భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో అచ్చంగా భూమిలాంటి ఓ సూపర్ ఎర్త్ (Ross 508b super Earth)ను NASA పరిశోధకులు గుర్తించారు.

Ross 508b Super Earth : అచ్చం భూమిలా ఉండే ‘సూపర్ ఎర్త్’ ను గుర్తించిన శాస్త్రవేత్తలు

Ross 508b super Earth

Ross 508b super Earth : ఈ అనంత విశ్వాన్ని జల్లెడ పడుతున్న పరిశోధకులు మరో గ్రహాన్ని కనుగొన్నారు. అచ్చంగా మన భూమిని పోలి ఉన్న మరో ‘సూపర్ ఎర్త్’ను కనుగొన్నారు. కోటాను కోట్ల జీవరాశులతో పాటు మనుషులు కూడా నివసిస్తున్న ఈ భూమిలాంటి మరో గ్రహం ఈ అనంత విశ్వంలో ఉండకపోతుందా? అనే ఆలోచనతో పరిశోధకులు ఈ విశ్వాన్ని అత్యంత శక్తివంతమైన టెలీస్కోపులతో జల్లెడపడుతున్నారు.

భూమిని పోలినటువంటి మరే ఇతర గ్రహాలైనా విశ్వంలో ఉన్నాయా? అనే వివరాలు తెలుసుకోవడానికి చేస్తున్న ముమ్మరం ప్రయత్నాల్లో భాగంగా మన భూమికి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఓ గ్రహాన్ని (Ross 508b super Earth)   NASA పరిశోధకులు తాజాగా గుర్తించారు. హవాయిలోని జపాన్ యొక్క నేషనల్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (NAOJ) సుబారు టెలిస్కోప్‌ను ఉపయోగించి ఈ సూపర్ ఎర్త్ ను కనుగొన్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.  ఈ సూపర్ ఎర్త్ సూర్యుడికి భూమి మధ్య ఉన్న దూరం కంటే కేవలం 0.05 రెట్లు ఎక్కువ దూరంలోనే ఈ గ్రహం (Ross 508b)తన నక్షత్రంతో ఎడంగా ఉన్నదని పరిశోధకులు తెలిపారు.

దీంతో ఆ గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉండి ఉండొచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీరు ఉంటే జీవం ఉన్నట్లేగా..అందుకే నీటితో పాటు ఆ సూపర్ ఎర్త్ పై జీవం ఉండటానికి కూడా పరిస్థితులు దోహదపడొచ్చని అభిప్రాయపడుతున్నారు. భూమి కంటే నాలుగు రెట్లు ఎక్కువ బరువుతో ఉన్న ఈ గ్రహం అక్కడే ఉన్న ఓ నక్షత్రం చుట్టూ ఒకసారి పరిభ్రమణం చేయడానికి 10.8 రోజులు పడుతుందట.