Kabul Airport : కాబూల్‌‌లో మారణహోమం, జన సమూహం మధ్యలో పేలుడు..72 మంది మృతి

తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో.. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు.

Kabul Airport : కాబూల్‌‌లో మారణహోమం, జన సమూహం మధ్యలో పేలుడు..72 మంది మృతి

Kabul

73 People Killed : బాంబు దాడులతో కాబూల్‌ దద్దరిల్లింది. తాలిబన్ల కబంద హస్తాల్లోకి వెళ్లిన అఫ్ఘానిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో.. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులతో మారణహోమం సృష్టించారు. హమీద్‌ కర్జాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు పాల్పడ్డారు ఉగ్రవాదులు. ఎయిర్‌ పోర్టులో వరుసగా రెండు ఆత్మాహుతి దాడులు.. ఆ తర్వాత ఓ బాంబు పేలుడు జరిగినట్లు తెలుస్తోంది. ఎయిర్‌పోర్ట్‌ పశ్చిమ గేటు దగ్గర 2021, ఆగస్టు 26వ తేదీ గురువారం రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మొదటి పేలుడు జరిగింది.

Read More : TTD : తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’, గో ఆధారిత భోజనం ఇలా

శరీర భాగాలు తునాతునకలు :-
బరోన్ హోటల్‌ దగ్గర రాత్రి 8 గంటల 3 నిమిషాలకు రెండో పేలుడు జరిగింది. జనం మధ్యలోకి వెళ్లి ఉగ్రవాదులు తమను తాము పేల్చుకున్నారు. దీంతో పక్కనున్న వారంతా తునాతునకలయ్యారు. ఆ రోడ్డంతా రక్తసిక్తమయింది. కాళ్లు, నడుం భాగాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ఎయిర్ పోర్ట్ దగ్గర పరిస్థితి హృదయవిదారకంగా మారింది. ఎటు చూసినా శవాలు కనిపిస్తున్నాయి. పేలుడు ధాటికి మృతదేహాలంతా కాబూల్ ఎయిర్‌ పోర్ట్ ముందున్న డ్రైనేజీ కాల్వలో పడ్డాయి. పేలుళ్లతో పదుల సంఖ్యలో అఫ్ఘాన్‌ ప్రజలు మృతిచెందారు. ఈ మారణహోమం తమ పనేనంటూ… ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద సంస్థ ISIS-K ఒప్పుకుంది. రష్యా విదేశాంగ శాఖ కూడా ఈ దాడులను ధ్రువీకరించింది.

Read More :YouTube : 10లక్షలకు పైగా వీడియోలు తొలగింపు

72 మంది మృతి :-
పేలుళ్ల ఘటనలో సుమారు 72 మంది దుర్మరణం పాలయ్యారు. మరణించిన వారిలో 12 మంది అమెరికా సైనికులు ఉన్నారు. దాడుల్లో 140 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్టు అఫ్ఘాన్‌, అమెరికా అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది.  తాలిబన్ల దురాక్రమణను భరించలేక.. అఫ్ఘాన్‌ను వీడేందుకు అమెరికా, ఇతర మిత్రదేశాల పౌరులు, గతంలో విదేశీ బలగాలకు సహకరించిన అఫ్ఘాన్‌ను కొద్దిరోజులుగా కాబుల్‌ విమానాశ్రయానికి వేల సంఖ్యలో చేరుకుంటున్నారు. ఈనెల 31లోగా.. అఫ్ఘాన్‌ నుంచి అమెరికా తన బలగాలను ఉపసంహరించుకోవాలని.. అప్పటిలోగా ఎలాగైనా దేశం విడిచి వెళ్లిపోవాలని తాలిబన్లు డెడ్‌లైన్‌ విధించారు.

Read More : Tragedy In Marriage : కాసేపట్లో కన్యాదానం, ఇంతలోనే దారుణం.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త

పేలుళ్లకు ముందు కాల్పులు :-
తాలిబన్లు తమను లక్ష్యంగా చేసుకుంటారన్న భయం, ఆందోళనలో ఎయిర్‌పోర్టుకు చేరుకున్నవారిపై.. ఉగ్రవాదులు తెగబడ్డారు. ఆత్మహుతి దాడులతో చెలరేగిపోయారు. విమానాశ్రయానికి వెళ్లే గేట్ల వద్ద జనం భారీగా గుమిగూడిన చోట ఈ పేలుళ్లు సంభవించాయి. రెండు చోట్ల ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు సభ్యులు పేలుళ్లకు పాల్పడినట్టు అమెరికా రక్షణశాఖ తేల్చింది. పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. పేలుడు జరిగిన సమయంలో 400 నుంచి 500 ల వరకు ప్రజలు ఉన్నారన్నారు. పేలుళ్లలో గాయపడ్డవారిని కాబూల్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.