Australia Rats : ఎలుకలే ఎలుకలు..ప్రజల ఇబ్బందులు, భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్ విషం కొనుగోలు!

ఆస్ట్రేలియాలో ఎలుకల బెడదతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూ సౌత్ వేల్స్‌లోని ఎలుకలు దండయాత్ర చేస్తున్నట్టే ఉంది పరిస్థితి. దీంతో ఎలుకలను చంపేందుకు నిషేధంలో ఉన్న బ్రోమాడియోలోన్ విషాన్ని భారత్‌ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్దమైంది న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం.

Australia Rats : ఎలుకలే ఎలుకలు..ప్రజల ఇబ్బందులు, భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్ విషం కొనుగోలు!

Rats

Australia Bromadiolone Poison : ఆస్ట్రేలియాలో ఎలుకల బెడదతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. న్యూ సౌత్ వేల్స్‌లోని ఎలుకలు దండయాత్ర చేస్తున్నట్టే ఉంది పరిస్థితి. దీంతో ఎలుకలను చంపేందుకు నిషేధంలో ఉన్న బ్రోమాడియోలోన్ విషాన్ని భారత్‌ నుంచి కొనుగోలు చేసేందుకు సిద్దమైంది న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం. 5 వేల లీటర్ల పాయిజన్ కొనుగోలు కోసం ఆర్డర్ చేసింది. న్యూ సౌత్ వేల్స్‌లో ఇళ్లలో, పంట పొలాలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లలో వందల కొద్ది బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏం చేయాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు అక్కడి జనం. ఎలుకల బెడదతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాటివల్ల నిద్రలేని రాత్రులు గడిపి ఆసుపత్రులపాలవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

ఎలుకల పాయిజన్ వేగంగా రవాణా చేసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వం 3 వేల ఆరు వందల కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఈ ప్రతిపాదనను అక్కడి ఫెడరల్ ప్రభుత్వం అంగీకరించాల్సి ఉంది. అత్యంత విషపూరితమైనది కావడంతో వీటి వినియోగంపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ఇతర జంతువులు, ప్రాణులపై ప్రభావం చూపే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఆ ప్రాంతాలు వరదలు, అగ్ని ప్రమాదాలతో తీవ్రంగా నష్టపోయి ఉంది. తాజాగా ఎలుకల బెడదతో మరిన్ని కష్టాలు పడుతున్నారు అక్కడి జనం. రానున్న మరికొన్ని రోజుల్లో భారీ వర్షాలతో వరదలు వస్తే కొట్టుకుపోతాయని…అప్పటి వరకు వేచి ఉండక తప్పందంటున్నారు.

Read More : Noise Pollution Fine: ష్.. సౌండ్ చెయ్యొద్దు.. ఫైన్ పడిపోద్ది..