Australia’s Gina Rinehart : ఒక్కొక్కరికీ రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్.. షాక్ నుంచి తేరుకుని ఆనందోత్సాహంలో తేలిపోయిన ఉద్యోగులు!

అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, లెనోవో, అడోబ్, సేల్స్ ఫోర్స్,పెప్సీకో తాజాగా సిస్కో వంటి బడా బడా సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తుంటే ఓ లేడీ బాస్ మాత్రం తన ఉద్యోగులకు దిమ్మతిరిగిపోయే బోనస్సులు ప్రకటించారు. ఒక్కొక్కరికీ రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్ ఇచ్చిన ట్విస్ట్ లోంచి షాక్ నుంచి తేరుకుని ఆనందోత్సాహంలో తేలిపోయారు ఉద్యోగులు..

Australia’s Gina Rinehart : ఒక్కొక్కరికీ రూ. 80 లక్షల బోనస్ ప్రకటించిన లేడీ బాస్.. షాక్ నుంచి తేరుకుని ఆనందోత్సాహంలో తేలిపోయిన ఉద్యోగులు!

Australia's Gina Rinehart Rs.80 lakhs bonus

Australia’s Gina Rinehart : అమెజాన్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, లెనోవో, అడోబ్, సేల్స్ ఫోర్స్,పెప్సీకో తాజాగా సిస్కో వంటి బడా బడా సంస్థలు ఉద్యోగుల్ని తొలగిస్తుంటే ఓ లేడీ బాస్ మాత్రం తన ఉద్యోగులకు దిమ్మతిరిగిపోయే బోనస్సులు ప్రకటించారు. అ కంపెనీ లేదు..ఈ కంపెనీలేదు..జాతీయం లేదు అంతర్జాతీయం లేదు..బడా బడా కంపెనీలన్నీ ఖర్చులు పెరిగిపోయాయి బాబాయ్ అంటూ ఉద్యోగుల్ని రాత్రికి రాత్రే పీకిపారేస్తుంటో ఓ లేడీ బాస్ మాత్రం తన ఉద్యోగులకు కలలో కూడా ఊహించనంత బోనస్ ప్రకటించారు. ఒక్కో ఉద్యోగికి 1 లక్ష డాలర్లు అంటే మన భారత కరెన్సీలో రూ.దాదాపు 82 లక్షలు ప్రకటించారు. దీంతో ఉద్యోగులు ఇది కలా? నిజమా? జోకా? రియలా? అంటూ తెగ ఆశ్చర్యపోతున్నారు. అది నిజమేనని తెలిసి గుండెలు స్పీడ్ కొట్టేసుకోగా ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.

Citadel CEO Ken Griffin : ఈ బాసు భలే తోపు .. 10,000మంది ఉద్యోగుల కుటుంబాలకు ఫ్రీగా డిస్నీల్యాండ్ ట్రిప్..

ఆ లేడీ బాస్ ఉద్యోగుల్ని సమావేశ పరిచేసరికి ఇక ఈరోజుతో మన ఉద్యోగాలు ఊడిపోతాయని ప్రతీ ఒక్కరు గుండెలు అరిచేతిల్లో పట్టుకుని క్షణమొక యుగంలా గడిపారు. కానీ బాసు భారీగా బోనస్సులు ప్రకటించేసరికి నమ్మలేక ఒకరి మొహాలు ఒకరు చూసుకుని ఆ షాక్ నుంచి తేరుకోవటానికి చాలాసేపే కష్టపడ్డారు. ఆ తరువాత అసలు విషయం అర్థం అయిన ఆ ఉద్యోగుల సంభ్రమాశ్యర్యానందాలకు గురి అయిన తీరు వారి జీవితంలో మర్చిపోలేనదంటున్నారు.ఉద్యోగులతో నిర్వహించిన సమావేశంలో ఒక్కొక్కరి పేరు చదువుతుంటే వారి గుండెలు ఆగిపోయినంత పనైంది. తమ ఉద్యోగాలు ఊడిపోయినట్టేనని ఊహించుకుని భయపడిన క్షణంలోనే ఒక్కొక్కరికి లక్ష డాలర్ల చొప్పున బోనస్ ప్రకటిస్తూ లేడీ బాస్ చేసిన ప్రకటన ఉద్యోగులను అత్యంత తీవ్ర ఉద్వేగానికి గురిచేసింది.

ఆస్ట్రేలియాలో పనిచేస్తున్న ప్రధాన కంపెనీలలో ఒకటి రాయ్ హిల్. ఈ కంపెనీని రెయిన్ హార్ట్ అనే మహిళ నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియాలో హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్ అనే మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీకి (గినా) రెన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కమ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచిన ఆమె 34 బిలియన్ డాలర్ల సంపదతో ఆస్ట్రేలియాలోని అత్యంత సంపన్నుల లిస్టులో ఉన్నారు. ఆమె తండ్రి స్థాపించిన హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ అనే మరో సంస్థలోని ఉద్యోగులతో ఇటీవల ఆమె సమావేశమయ్యారు.దీంతో ఉద్యోగులంతా హడలిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగల కోత తమకు కూడా తప్పదనుకున్నారు. ఎవరికి మూడిందో ఏంటోననుకున్నారు. లేడీ బాస్ ఒక్కొక్కరి పేరు చదువుతుంటే వారి ముఖాలు మాడిపోయాయి.

Cisco Lay Off : బడా కంపెనీల బాటలోనే సిస్కో .. 4,000మంది ఉద్యోగులు తొలగింపు

అలా సంస్థలోని 10 మంది ఉద్యోగుల పేర్లను చదివి వినిపించారు. ఆ పేర్లు విన్న వారు తమ ఉద్యోగాలు పోయినట్టేనని భావించారు. కానీ ఆమె ఆ 10 మంది ఉద్యోగులకు క్రిస్మస్ బోనస్‌గా ఒక్కొక్కరికి లక్ష అమెరికన్ డాలర్ల (దాదాపు రూ. 82 లక్షలు) చొప్పున బోనస్ ఇస్తున్నట్టు ప్రకటించి వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బోనస్ అందుకోబోతున్న పది మందిలో మూడు నెలల క్రితమే కంపెనీలో చేరిన ఓ ఉద్యోగి కూడా ఉండడం గమనించాల్సిన విషయం. ఇక వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఆ కంపెనీ ఒక్క సంవత్సర కాలంలో ఏకంగా 3.3 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించింది. ఈ లాభాల్లో ఉద్యోగుల కష్టం కూడా ఉంది. అదే ఉద్యేశ్యంతోనే సదరు సంస్థ భారీగా బోనస్సులు ప్రకటించింది.