Citadel CEO Ken Griffin : ఈ బాసు భలే తోపు .. 10,000మంది ఉద్యోగుల కుటుంబాలకు ఫ్రీగా డిస్నీల్యాండ్ ట్రిప్..

ఉద్యోగులకు వారు పనిచేసే సంస్థ బోనస్ ఇచ్చినా..ఏదన్నా ఫ్రీ గిఫ్టులు ఇచ్చినా తెగ సంతోషపడిపోతారు. మా బాసు భలే మంచోడు అంటూ తెగ పొగిడేస్తారు. అటువంటిది ఏకంగా డిస్నీలాండ్ ట్రిప్ అవకాశం ఇస్తే ఇక ఆ ఉద్యోగుల ఆనందానికి హద్దు ఉంటుందా? అదికూడా ఫ్రీగా..పైగా కుటుంబాలతో కలిసి..! అటువంటి సంతోషాన్ని ఇచ్చారు తమ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు, సిటాడెల్ ఫౌండర్, సీఈవో కెన్ గ్రిఫిన్..10,000మంది ఉద్యోగులకు విమానం టికెట్లనుంచి టూర్ ట్రిప్ మొత్తం ఫ్రీ అంటూ చెప్పేసరికి ఇక వారి ఆనందం అంతా ఇంతా కాదు.

Citadel CEO Ken Griffin : ఈ బాసు భలే తోపు .. 10,000మంది ఉద్యోగుల కుటుంబాలకు ఫ్రీగా డిస్నీల్యాండ్ ట్రిప్..

Citadel CEO and founder Ken Griffin

Citadel CEO and founder Ken Griffin : ఉద్యోగులకు వారు పనిచేసే సంస్థ బోనస్ ఇచ్చినా..ఏదన్నా ఫ్రీ గిఫ్టులు ఇచ్చినా తెగ సంతోషపడిపోతారు. మా బాసు భలే మంచోడు అంటూ తెగ పొగిడేస్తారు. అటువంటిది ఏకంగా డిస్నీలాండ్ ట్రిప్ అవకాశం ఇస్తే ఇక ఆ ఉద్యోగుల ఆనందానికి హద్దు ఉంటుందా? అదికూడా ఫ్రీగా..పైగా కుటుంబాలతో కలిసి..! ఇక ఆ ఉద్యోగుల గాల్లో తేలిపోతారు. అటువంటి సంతోషాన్ని ఇచ్చారు తమ ఉద్యోగులకు సంస్థ వ్యవస్థాపకుడు, సిటాడెల్ ఫౌండర్, సీఈవో కెన్ గ్రిఫిన్..విమానం టికెట్లనుంచి టూర్ ట్రిప్ మొత్తం ఫ్రీ అంటూ చెప్పేసరికి ఇక ఉద్యోగుల ఆనందం అంతా ఇంతా కాదు. ఒకరు ఇద్దరికి కాదు ఏకంగా 10,000మంది ఉద్యోగులకు..వారి కుటుంబాలకు కూడా ఫ్రీగా డిస్నీలాంట్ ట్రిప్ అరేంజ్ చేశారు గ్రిఫిన్.

సీఈవో కెన్ గ్రిఫిన్ కంపెనీలో పనిచేసే 10,000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు డిస్నీల్యాండ్ లో మూడు రోజుల పర్యటన విడిది ట్రిప్ ఉచితంగా ఏర్పాటు చేశారు. ఉద్యోగులు నివసించే ప్రాంతం నుంచి ఫ్లోరిడాలోని డిస్నీల్యాండ్ చేరుకోవడానికి ఫ్లయిట్ టికెట్ల కూడా గ్రిఫిన్ ఏర్పాటు చేశారు. ఉద్యోగులు కంపెనీకి అందిస్తున్న సేవలను ఆయన ఈ విధంగా గుర్తించిన గ్రిఫిన్ వారి కుటుంబాలతో కలిసి సంతోషంగా ట్రిప్ ఎంజాయ్ చేయాలని సూచించారు. ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా విమాన టికెట్లనుంచి తినే తిండితో పాటు ఇతరత్రా అన్ని ఖర్చులు సంస్థే భరిస్తుందని ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా మొత్తం సిటాడెల్ కంపెనీయే భరించింది.న్యూయార్క్, హ్యూస్టన్, పారిస్, జ్యూరిచ్ తో పాటు ఇతర నగరాల్లో ఉన్న తమ సంస్థ ఉద్యోగులకు ఇటువంటి ఏర్పాట్లు చేశారు గ్రిఫిన్.

దీనిపై గ్రిఫిన్ మాట్లాడుతూ..‘‘చరిత్రలోనే కాకుండా, ఫైనాన్స్ చరిత్రలోనూ ఎంతో అసాధారణ టీమ్ ను మనం ఏర్పాటు చేసుకున్నాం. మన ముందు ఎంతో అద్భుత భవిష్యత్తు ఉంది. కొత్త అధ్యాయాల ను లిఖించేందుకు చూస్తున్నాను’’ అంటూ ఉద్యోగులకు సందేశం ఇచ్చారు. గ్రిఫిన్ 31.7 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలో 40వ అత్యంత సంపన్నుడిగా ఉన్నారని ఫోర్బ్స్ విడుదల చేసిన లిస్టు వెల్లడిస్తోంది.