Australians Banned: ఇండియా నుంచి తిరిగొస్తే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు

ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి రావొద్దని అక్కడ ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించింది. దానిని అతిక్రమించి ..

Australians Banned: ఇండియా నుంచి తిరిగొస్తే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు

Australia People

Australians Banned: ఇండియా నుంచి ఆస్ట్రేలియాకు తిరిగి రావొద్దని అక్కడ ప్రభుత్వం తాత్కాలిక నిషేదం విధించింది. దానిని అతిక్రమించి వచ్చిన వారికి శిక్షలు తప్పవని సూచించింది. శుక్రవారం జరిగిన నేషనల్ క్యాబినెట్ మీటింగ్ లో ఈ నిర్ణయం తీసుకుంది.

ఇండియాలో వరుసగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని ఆస్ట్రేలియాలో వ్యాప్తి జరగకుండా ఉండేలా ప్లాన్ చేసింది. ఇండియా నుంచి వచ్చిన విదేశీ ప్రయాణికులను క్వారంటైన్ లో ఉంచగా వారిని కాంటాక్ట్ అయిన వాళ్లకు పాజిటివ్ వచ్చినట్లుగా గుర్తించారు.

బయోసెక్యూరిటీ యాక్ట్, 2015 ఎమర్జెన్సీ యాక్ట్ కింద 300 యూనిట్స్ జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష లేదా రెండూ ఉంటాయని మంత్రిత్వ శాఖ అధికారికంగా చెప్పింది. మే15న మరోసారి చర్చించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ సలహాతో మరోసారి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

ఆస్ట్రేలియా పబ్లిక్ హెల్త్, క్వారంటైన్ సిస్టమ్ లు కొవిడ్-19 కేసులను ఐసోలేషన్ ఫెసిలిటీ సెంటర్లలో పర్యవేక్షించేంతలా మార్చారు. ఇండియా-ఆస్ట్రేలియా కమ్యూనిటీ గురించి ఈ స్టేట్మెంట్ లో పేర్కొన్నారు. అక్కడే ఉన్న ఆస్ట్రేలియా కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ తో ఉన్న బంధాలు తెగిపోవాల్సిందేనా అని ప్రశ్నించారు.

ఆస్ట్రేలియా ఎమర్జెన్సీ మెడికల్ సప్లైస్, 1000 నాన్ ఇన్వాసివ్ వెంటిలేటర్లు అందించడానికి ముందుంది. అదే కాకుండా పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్(పీపీఐ), మిలియన్ సర్జికల్ మాస్కులు, లక్ష సర్జికల్ గౌన్లు, లక్ష గాగుల్స్, లక్ష జతల గ్లౌజులు, 20వేల ఫేస్ షీల్డులు కూడా ఇచ్చేందుకు ముందున్నామని తెలిపింది.