బురదలో చిక్కుకున్న ఏనుగు పిల్లను బతికుండగానే పీక్కు తినేసిన హైనాలు: గుండెలు ద్రవించే ఘటన

  • Published By: veegamteam ,Published On : February 24, 2020 / 09:54 AM IST
బురదలో చిక్కుకున్న ఏనుగు పిల్లను బతికుండగానే పీక్కు తినేసిన హైనాలు: గుండెలు ద్రవించే ఘటన

బురదలో చిక్కుకుని బైటకు రాలేని ఓ ఏనుగు పిల్లను బతికుండానే హైనాలు పీక్కుని తినేశాయి. ఏనుగు తొండంతో కొడితే ఆమడదూరం వెళ్లిపడే హైనాలు (దుమ్మలగొండి) బురదలో పడి బైటకు రాలేని దుస్థితిని ఆసరాగా చేసుకుని దానిపై దాడిచేశాయి. వాటి పదునైన పళ్లతో ఏనుగు పిల్ల తొండాన్ని పీక్కుని తినేసి నరకాన్ని చూపించాయి. హృదయాన్ని ద్రవింపజేసే ఈ ఘటన జింబాబ్వే అడవుల్లో చోటుచేసుకుంది. జర్మనీకి చెందిన వైల్డ్ ఫొటోగ్రాఫర్ జెన్స్ కల్మాన్ తీసిన ఈ చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిని చూసినవారంతా అయ్యో..ఏనుగు పిల్ల ఎంత కష్టంలో పడింది..అంటూ వాపోతున్నారు. 

బురదలో ఇరుక్కుపోయిన ఏనుగు పిల్లను బయటకు తీయడానికి తల్లి ఏనుగు ఎంతో ప్రయత్నించింది. ఇది గమనించిన హైనాలు అటువైపుకు రావడం తల్లి ఏనుగు చూసింది. పిల్లను కాపాడుకోవటానికి చేయని ప్రయత్నమంటూ లేదు. బురదలో పడిన పిల్ల ఏనుగు హైనాలకు కనిపించకుండా ఉండటానికి తల్లి ఏనుగు పిల్ల ఏనుగు ముఖం మీద వేసింది. మట్టి రంగులో తన పిల్ల కలిసిపోయి హైనా కంట పడకుండా ఉంటుందని ఆశపడింది. 

కానీ ఫలితం దక్కలేదు. పిల్లను కాపాడుకోవటానికి తల్లి ఏనుగు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. హెన్నాలు తల్లి ఏనుగును తరిమేసి పిల్ల ఏనుగుపై దాడికి తెగబడ్డాయి. పిల్ల ఏనుగు బతికి ఉండగానే దాని శరీరాన్ని చిధ్రం చేశాయి. దొరికిన భాగాలను నోట కరుచుకుని పరుగులు పెట్టాయి. ఈ చిత్రాలను చూసిన నెటిజనులు.. పాపం ఆ క్షణంలో అది ఎంత నరకం అనుభవించి ఉంటుందో అని బాధను వ్యక్తం చేస్తున్నారు.

జీవికి జీవి ఆహారం..చిన్న జంతువులను పెద్ద జంతువులు..సాధు జంతువులను క్రూర మృగాలు చంపి తినటం ప్రకృతి ధర్మం. కానీ ఇలా నిస్సహాయంగా పడి ఉన్న ఏనుగును చంపి తినటం హైనాల వంటి జంతువులకు సర్వసాధారణం. ఇది అడవినీతి. సాధారణంగా హైనాలు స్వంతగా వేటాడలేవు. పులి, చిరుత, సింహం వంటి క్రూర మృగాలు జంతువులను వేటాడి వాటి కడుపు నిండిన తరువాత మిగతాది వదిలేస్తాయి. ఈ మిగిలిన  జంతువుని హైనాలు తింటాయి. లేదా ఇదిగో ఇటువంటి నిస్సహాయంగా పడి ఉన్న జంతువుల్ని తింటాయి.

e

 

66