Afghanistan : అప్ఘాన్‍‍‌‌ దాటిన పసికందు.. కన్నీళ్లతో కన్నవారికి అందించిన పెంపుడు తండ్రి

తమ బిడ్డను ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డారు. వారు పెట్టుకున్న కన్నీళ్లకు సఫీ గుండె కరిగిపోయింది. చిన్నారిని తాత రజావికి అప్పగించాడు. బిడ్డను ఎత్తుకున్న తండ్రి...

Afghanistan : అప్ఘాన్‍‍‌‌ దాటిన పసికందు.. కన్నీళ్లతో కన్నవారికి అందించిన పెంపుడు తండ్రి

Afghan Child

Afghanistan Airlift Found : ఈ ఫొటో అందర్నీ కలిచివేసింది. అప్ఘాన్ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఆ ఫొటో అద్దం పట్టింది. అప్ఘాన్ ను తాలిబన్లు వశం చేసుకున్న తర్వాత హృదయవిదాకర ఘటనలు చోటు చేసుకున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టులో ప్రజలు బారులు తీరారు. కొందరైతే..విమానాల పైన, చక్రాల్లో కూర్చొని ప్రయాణించారు. ఎంతో మంది ప్రాణాలు కూడా పొగొట్టకున్నారు. తమకు ఏదైనా ఫర్వాలేదు..కానీ..పిల్లలకు ఏదీ కాకుడదనే ఉద్ధేశ్యంతో వారిని కంచెలను దాటించారు. అక్కడున్న సైనికులను వారిని తీసుకున్నారు. అలాగే ఓ తండ్రి పసికందును ఫెన్సింగ్ దాటించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత సంవత్సరం ఆగస్టు నెలలో జరిగింది.

Read More : Covid-19: జలుబు వచ్చిందా.. కొవిడ్ నుంచి ప్రొటెక్షన్ వచ్చినట్లే

అప్ఘాన్ లో మీర్జా అల అహ్మదీ, సురయా దంపతులు నివాసం ఉండేవారు. వీరికి సోహైల్ అహ్మదీ చిన్నారి ఉంది. అప్ఘాన్ ను వశం చేసుకున్న తర్వాత..అమెరికాకు వెళుదామని భార్యతో నలుగురు పిల్లలను వెంట పెట్టుకుని బయలుదేరారు. ముందుగా బిడ్డను ఎయిర్ పోర్టులోకి చేరవేయాలని ఫెన్సింగ్ దాటించాడు. తమ బిడ్డను సైనికులు తమ వద్దకు చేరుస్తారనే భరోసాతో వారికి అప్పగించారు. ఎయిర్ పోర్టులో చిన్నారి కనిపించలేదు. నెలల చిన్నారి కనిపించకుండా పోయాడు. ఎక్కడున్నాడో తెలియరాలేదు. తల్లిదండ్రుల రోదన అరణ్యరోదనగానే మిగిలిపోయింది. చిన్నారి ఉన్న క్షణాలను గుర్తు పెట్టుకుని రోదించారు. నాలుగు నెలల పాటు నిద్రాహారాలు మానేసి…బిడ్డ కోసం ప్రయత్నాలు చేశారు.

 

Afghanistan

Read More : Virat Kohli : కేఎల్ రాహుల్‌ కెప్టెన్సీపై కోహ్లీ షాకింగ్ కామెంట్స్..!

చివరకు పునరావాసం కింద అమెరికాకు మీర్జా అల అహ్మదీ కుటుంబం వెళ్లిపోయింది. చిన్నారి వెతికే పనిని చిన్నారి తాత మొహమ్మద్ ఖాసేమ్ రజావికి అప్పగించాడు. రెడ్ క్రాస్ సహాయం తీసుకున్నారు. చిన్నారి ఓ ట్యాక్సీ డ్రైవర్ దగ్గర ఉన్నట్లు తేలింది. ట్యాక్సీ డ్రైవర్ సఫీ వద్దకు ఖాసేమ్ రజావి వెళ్లాడు. బాబును ఇవ్వాలని కోరాడు. దీనికి సఫీ అంగీకరించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసి కిడ్నాప్ కేసు పెడుతానని బెదిరించినా…అతను వినిపించుకోలేదు. చివరకు ఈ విషయాన్ని మీర్జా అలీ అహ్మదీకి తెలియచేశాడు. తమ బిడ్డను ఇవ్వాలని తల్లిదండ్రులు ప్రాథేయపడ్డారు. వారు పెట్టుకున్న కన్నీళ్లకు సఫీ గుండె కరిగిపోయింది. చిన్నారిని తాత రజావికి అప్పగించాడు. బిడ్డను ఎత్తుకున్న తండ్రి ఆనందభాష్పాలు కార్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.