Pakistan: 33 మంది తాలిబన్ తీవ్రవాదుల్ని కాల్చి చంపిన పాక్ భద్రతా దళాలు

బన్ను కంటోన్మెంట్ పరిధిలో ఉన్న కౌంటర్ టెర్రరిజం సెంటర్‌పై దాడి చేసి, అక్కడి వారిని బంధీలుగా చేసుకున్న తాలిబన్ టెర్రరిస్టుల్ని పాక్ బలగాలు కాల్చి చంపాయి. దాదాపు 40 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.

Pakistan: 33 మంది తాలిబన్ తీవ్రవాదుల్ని కాల్చి చంపిన పాక్ భద్రతా దళాలు

Pakistan: తీవ్రవాద వ్యతిరేక దళానికి చెందిన సభ్యుల్ని బంధీలుగా చేసుకున్న పాకిస్తాన్‌కు చెందిన తాలిబన్ తీవ్రవాదుల్ని పాక్ భద్రతా దళాలు కాల్చి చంపాయి. 33 మంది తాలిబన్ తీవ్రవాదుల్ని కాల్చి చంపినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు భద్రతా దళాలకు చెందిన సిబ్బంది కూడా మరణించారు.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

గత ఆదివారం తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్తాన్ (టీటీపీ)కి చెందిన తీవ్రవాదులు పాకిస్తాన్, ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్‌లోని బన్ను ప్రాంతంలో ఉన్న ఒక కౌంటర్ టెర్రరిజం సెంటర్‌పై దాడి చేశారు. ఆ సెంటర్‌ను, ఆయుధాల్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడి సిబ్బందిని బంధీలుగా చేసుకున్నారు. దీంతో అటు తీవ్రవాదులకు, ఇటు పాకిస్తాన్ భద్రతా దళాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పులు దాదాపు 40 గంటలపాటు సాగాయి. పాక్ దళాలు అతి కష్టమ్మీద ఈ ఆపరేషన్ విజయవంతం చేశాయి. పాక్ భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో 33 మంది టీటీపీ తీవ్రవాదులు మరణించారు. ఇద్దరు పాక్ సిబ్బంది కూడా మరణించారు.

అయితే, బంధీలుగా చేసుకున్న వారిలో ఎవరైనా మరణించారో.. లేదో ఇంకా స్పష్టత లేదు. దీనిపై పాక్ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా, కొందరిని బంధీలుగా చేసుకున్న తీవ్రవాదులు ప్రభుత్వానికి పలు డిమాండ్లు చేశారు. పాక్ జైళ్లలో ఉన్న తమ తీవ్రవాదుల్ని విడిచిపెట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. తాము 9 మందిని బంధీలుగా చేసుకున్నామని అంతకుముందు ఒక వీడియో విడుదల చేశారు.