జోరుగా గబ్బిలాల అమ్మకాలు కొనసాగిస్తున్న ఇండోనేషియా

జోరుగా గబ్బిలాల అమ్మకాలు కొనసాగిస్తున్న ఇండోనేషియా

bats: కరోనా మహమ్మారితో ప్రపంచం వణికిపోతుంటే వైరస్ వ్యాప్తికి కారకాలైన గబ్బిలాలను మాత్రం ఇంకా మెనూ నుంచి తీయడం లేదు ఇండోనేషియా వ్యాపారస్థులు. అడవుల్లో నెట్స్, వలల సహాయంతో వేట మొదలుపెట్టారు. ఒకసారి రెక్కలు తొలగించాక మార్కెట్లో పెట్టి అమ్మేస్తారు. దానిని పూర్తిగా క్లీన్ చేసి ఇక వంటకు రెడీ చేసేస్తారట.

కొన్ని నెలలుగా చాలా ప్రాంతాల్లో గబ్బిలం వంటకం చాలా డెలిషియస్‌గా అమ్ముడవుతుందట. వీటి మాంసం వల్లే వైరస్ వ్యాప్తి జరుగుతుందని అయినప్పటికీ ఇదే వ్యాపారాలు కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు. వూహాన్ లో మొదలైన వైరస్ మొదటిగా జంతువుల నుంచి మనుషులకు సంక్రమించినట్లు సమాచారం.

ఇండోనేషియాలోని లాంగోవున్ మార్కెట్లో పాములు, బల్లులు, ఎలుకలు, అడవి పందుల మాంసాలు యథేచ్ఛగా అమ్ముతుంటారు.

ఆరంభంలో గబ్బిలం మాంసం తినడానికి భయపడేవాళ్లు క్రమంగా తగ్గిపోతున్నారు. దాని వంటలో ఉన్న రుచిని చూసి అందరూ నోరెళ్లబెట్టుకుని కూర్చుకుంటున్నారని లోకల్ వ్యాపారస్థులు అంటున్నారు.

మార్కెట్లో గబ్బిలం మాంసం అమ్మకూడదని మాకు ఎటువంటి నిబంధనలు లేవు. ఇది షట్ డౌన్ చేయడానికి కూడా ఎటువంటి ఆలెోచనలు లేవు. నిపుణుల అంచనా ప్రకారం.. విభిన్నమైన వంట విధానాలతో దీన్ని రెడీ చేస్తున్నాం. శుభ్రమైన వాతావరణంలో పెరిగిన వాటిని తీసుకొచ్చి మాత్రమే అమ్ముతున్నాం అని చెప్పుకుంటున్నారు స్థానిక వ్యాపారస్థులు.