Bear Dance : గున్న గున్నా మామిడి..! మంచు వానలో ఎలుగుబంటి స్టెప్పులు

ప్రకృతి పరవశించినప్పుడు ఎలుగు కూడా సంతోషంతో కుప్పిగంతులేస్తుంది. ఈ ఎక్స్ ప్రెషన్ ఓ సీసీ కెమెరా వీడియోలో రికార్డైంది.

Bear Dance : గున్న గున్నా మామిడి..! మంచు వానలో ఎలుగుబంటి స్టెప్పులు

Guddelugu

Bear Dance : ఎలుగుబంటి పేరు వింటేనే హడలెత్తిపోతారు జనం. కొండ ప్రాంతాలు.. పల్లెటూళ్లలోని రోడ్లపై… ఎలుగు కనపడితే పరుగెత్తాల్సిందే. కొండలు తరిగిపోతున్న ఈ రోజుల్లో… రాత్రివేళ పంట పొలాల దగ్గర ఎలుగుబంట్లు కనపడుతున్న దృశ్యాలు ఎన్నో చూస్తున్నాం.

చీకటివేళ మాత్రమే రెచ్చిపోయే ఎలుగు… పగటి పూట బయటకు రావాలంటేనే వణికిపోతుంది. దాని బలం ఎంతో.. బలహీనత కూడా అంతే. వెలుగు చూసినా.. మంట చూసినా.. పరుగో పరుగు. ప్రతి జీవికి ఆకలి… దాహం… కోపం… నిద్ర.. లాంటి నిత్య భావావేశాలతోపాటు… ఆనందం కూడా కలుగుతుంది. ప్రకృతి పరవశించినప్పుడు అందరిలాగే ఎలుగు కూడా సంతోషంతో కుప్పిగంతులేస్తుంది. ఈ ఎక్స్ ప్రెషన్ ఓ సీసీ కెమెరా వీడియోలో రికార్డైంది.

Solar Flowers : ఈ పువ్వుల్ని చన్నీళ్లలో వేస్తే వేడినీళ్లు రెడీ

అమెరికాలో మంచు వర్షం కురుస్తున్న టైంలో… కొండ ప్రాంతాల్లోని కొన్ని ఇళ్లమధ్యకు ఎలుగుబంటి, దాని పిల్ల వచ్చాయి. చల్లచల్లని వాతావరణంలో.. గున్న గుడ్డెలుగు రెండు చేతులు ఎత్తి.. అలా అలా… మంచుతో ఆటలాడుకుంది. కాసేపు ఆడుకుని వెళ్దాం అన్నట్టుగా ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది. గున్న ఎలుగు స్టెప్పుల వీడియో  వైరల్ గా మారింది. ఆ వీడియో మీరూ చూసి.. కాసేపు రిలాక్స్ అవ్వండి.