Beer Boy in Wedding : పెళ్లిలో బీర్ బాయ్ సందడి..అతిథులు దిల్ ఖుష్

పెళ్లిలో బీర్ బాయ్ బీర్ టిన్నులు..పువ్వులతో భలే సందడి చేస్తున్నాడు. అతిథులకు బీర్ టిన్స్ ఇస్తూ పూలు జల్లుతు తెగ సందడి చేస్తున్నాడు.

Beer Boy in Wedding : పెళ్లిలో బీర్ బాయ్ సందడి..అతిథులు దిల్ ఖుష్

Beed Boy In Weddding

Beer Boy in wedding : ఎవరైనా పెళ్లికి వచ్చిన అతిథులకు పువ్వులు ఇచ్చి వెల్కమ్ చెబుతారు. లేదా పన్నీరు, గంధం చల్లుతారు.పువ్వులు ఎంట్రన్స్ లో అందమైన అమ్మాయిలతోగానీ..చిన్నారులతోనో పువ్వులు ఇచ్చి స్వాగతం పలికిస్తారు. తరువాత డ్రింక్స్ ఇచ్చి మర్యాదలు చేస్తారు.కానీ ఓ పెళ్లి మాత్రం ఓ అబ్బాయి భలే భలే సందడి సందడి చేసాడు.

కానీ.. ఓ పెళ్లిలో ఫ్ల‌వ‌ర్ గ‌ర్ల్స్ లేరు..పన్నీరు చల్లే గర్ల్స్ లేరు..కానీ ఓ బీర్ బాయ్ మాత్రం తెగ సందడి చేసేస్తున్నాడు. ఓ డ‌బ్బా ప‌ట్టుకొని..బీర్ తాగేవాళ్లకు బీర్ టిన్స్ అందిస్తూ.. బీర్ తాగ‌ని వాళ్ల మీద పూలు చ‌ల్లుతూ వెడ్డింగ్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా సందడి సందడి చేసేస్తున్నాడు. అది చూసిన పెళ్లికొచ్చిన అతిథులు సరదాగా నవ్వేస్తున్నారు.

ఈ వీడియోను పెళ్లికొడుకే త‌న టిక్‌టాక్‌లో పోస్ట్ చేశాడు. దీంతో ఆ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అబ్బ‌.. మ‌నం వెళ్లే పెళ్లిళ్ల‌లో కూడా ఇలాంటి బీర్ బాయ్ ఉంటే ఎంత బాగుండు.. అని నెటిజ‌న్లుసరదాగా కామెంట్స్ చేస్తున్నారు.